Vinayaka Chavithi: నిమజ్జనం కోసం తరలుతున్న గణనాథులు... ట్యాంక్‌బండ్‌ పరిసరాలలో ట్రాఫిక్ జామ్

Traffic came to a standstill in and around Khairatabad
  • ట్యాంక్‌బండ్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్
  • ఖైరతాబాద్, నాంపల్లి, అబిడ్స్‌లో నిలిచిన వాహనాలు
  • ట్రాఫిక్ ఆంక్షలు, వాహనాల దారి మళ్లింపుతో వాహనదారుల ఇబ్బందులు
హుస్సేన్ సాగర్‌లో నిమజ్జనం కోసం గణేశ్ విగ్రహాలు భారీగా తరలి వస్తుండటంతో ట్యాంక్‌బండ్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ అయింది. ఖైరతాబాద్, నాంపల్లి, అబిడ్స్.. ఇలా పలు ప్రాంతాల్లో వాహనాలు నిలిచిపోయాయి. ట్యాంక్‌బండ్ మీద, ఆ చుట్టుపక్కల కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి.

గణేశ్ నిమజ్జనాల నేపథ్యంలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు, వాహనాల దారి మళ్లింపును చేపడుతున్నారు. దీంతో ట్యాంక్‌బండ్ పరిసర ప్రాంతాల్లో పావు గంట ప్రయాణానికి గంటలు తీసుకుంటోంది. రద్దీకి తగిన పోలీసుల పర్యవేక్షణ కూడా లేకపోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. మొజంజాహీ మార్కెట్ నుంచి ప్రారంభమై నాంపల్లి, లక్డీకాపూల్, ఖైరతాబాద్ వరకు భారీగా వాహనాలు నిలిచిపోయాయి.
Vinayaka Chavithi
Ganesh Immirsion
Telangana
Hyderabad

More Telugu News