Saripodhaa Sanivaaram: కలెక్షన్ల దుమ్మురేపుతున్న 'సరిపోదా శనివారం'

nanis saripodhaa sanivaaram collectes 100 crores
  • మరోసారి రూ.100 కోట్ల క్లబ్‌లో చేరిన నటుడు నాని
  • హర్షం వ్యక్తం చేసిన నిర్మాణ సంస్థ డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ 
  • 'బాక్సాఫీసు శివతాండవమే' పేరుతో నూతన పోస్టర్ విడుదల
'సరిపోదా శనివారం' సినిమా కలెక్షన్ల దుమ్మురేపుతోంది. 'దసరా' సినిమాతో తొలిసారి రూ.100 కోట్ల క్లబ్ లో చేరిన నాని.. మరోసారి సత్తా చాటాడు. 'సరిపోదా శనివారం' కూడా రూ.100 కోట్లకు పైగా వసూళ్లు (గ్రాస్) సాధించింది. చిత్ర నిర్మాణ సంస్థ డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ ఈ విషయాన్ని తెలియజేస్తూ సంతోషాన్ని వ్యక్తం చేసింది. ఇప్పుడు సరిపోయింది, మీరంతా (ప్రేక్షకులు) ఈ మూవీని ఆదరించి .. బాక్సాఫీసు వద్ద హిట్‌గా నిలిపారు అని పేర్కొంది. 'బాక్సాఫీసు శివతాండవమే' పేరుతో కొత్త పోస్టర్ విడుదల చేసింది.
ఆగస్టు 29న విడుదలైన ఈ సినిమా హవా కొనసాగిస్తూనే ఉంది. నూతన దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తెరకెక్కించిన 'దసరా'తో నాని తొలిసారి వంద కోట్ల క్లబ్ లో చేరిన విషయం తెలిసిందే. ఈ చిత్రం మంచి వసూళ్లు సాధించింది. ఈ నేపథ్యంలో తాజాగా పలు విభాగాల్లో సైమా – 2024 అవార్డులు సొంతం చేసుకుంది.

Saripodhaa Sanivaaram
Movie News

More Telugu News