Hyderabad Metro: నిమజ్జనం రోజున హైదరాబాదులో మెట్రో రైళ్లు ఎప్పటివరకు తిరుగుతాయంటే...!

Hyderabad Metro trains timings extended on immersion day
  • హైదరాబాదులో ఈ నెల 16, 17 తేదీల్లో మహా నిమజ్జనం
  • ఈ నెల 17న అర్ధరాత్రి 2 గంటల వరకు మెట్రో రైళ్లు
  • చివరి రైలు రాత్రి ఒంటిగంటకు బయల్దేరుతుందన్న మెట్రో రైల్ సంస్థ
హైదరాబాదు నగరం గణేశ్ మహా నిమజ్జనం కోసం సన్నద్ధమవుతోంది. ఈ నెల 16, 17 తేదీల్లో ఖైరతాబాద్ మహా గణపతి సహా లక్షలాది గణనాథుల విగ్రహాలను నిమజ్జనం చేయనున్నారు. ఈ నేపథ్యంలో, హైదరాబాదులో మెట్రో రైళ్ల సమయాన్ని పొడిగించారు. 

ఈ నెల 17వ తేదీన అర్ధరాత్రి 2 గంటల వరకు మెట్రో రైళ్లు నడుస్తాయని హైదరాబాద్ మెట్రో రైల్ సంస్థ పేర్కొంది. రాత్రి ఒంటిగంటకు చివరి రైలు బయల్దేరుతుందని వెల్లడించింది. అంతేకాకుండా, ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అదనపు రైళ్లను కూడా నడుపుతామని హైదరాబాద్ మెట్రో రైల్ సంస్థ వివరించింది.
Hyderabad Metro
Train Timings
Ganesh Immersion
Hyderabad

More Telugu News