Ford: భారత్ లో రీ ఎంట్రీ ఇస్తున్న 'ఫోర్డ్'

ford drives back to india chennai plant to reopen after Two year
  • రెండేళ్ల తర్వాత చెన్నైలో ప్లాంట్ రీ ఓపెన్ చేయనున్న ఫోర్డ్ 
  • ఫోర్డ్ తో తమిళనాడు సీఎం స్టాలిన్ సంప్రదింపులు
  • ప్లాంట్ రీ ఓపెన్ చేస్తామని ప్రభుత్వానికి లేఖ రాసిన ఫోర్డ్
మూడేళ్ల క్రితం దేశంలో ఇతర కారు తయారీ సంస్థలతో పోటీ తట్టుకోలేక ఇండియా నుండి వెళ్లిపోయిన అమెరికన్ ఆటో మేకర్ దిగ్గజం ఫోర్డ్ తిరిగి రాబోతోంది. భారత్ లోని తమిళనాడులో ఎగుమతుల కోసం తన తయారీ ప్లాంట్ ని పునః ప్రారంభించాలని ఫోర్డ్ యోచిస్తోంది. ఇండియా మార్కెట్ లోకి తిరిగి ప్రవేశించే అవకాశం ఉందని కంపెనీ ఇటీవల ప్రకటించింది. ఫోర్డ్ తో చర్చలు జరుపుతున్నట్లు తమిళనాడు సీఎం స్టాలిన్ చెప్పారు. ఇందుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వానికి ఫోర్డ్ లేఖను కూడా సమర్పించారు.

తమిళనాడు చెన్నై ప్లాంట్ లో ఫోర్డ్ తయారు చేయాలనుకుంటున్న కార్లు, ఇతర వివరాలను తర్వాత ప్రకటిస్తామని కంపెనీ తెలియజేసింది. గతంలో చెన్నై ప్లాంట్ లో ఫోర్డ్ కార్లు, ఇంజన్లు తయారు చేసింది. గ్లోబల్ మార్కెట్ కోసం ఎగుమతులు చేయడానికి ఫోర్డ్ తిరిగి ప్లాంట్‌ను రీ ఓపెన్ చేయనున్నట్లు తెలుస్తోంది.
Ford
chennai
cm stalin
Tamilnadu

More Telugu News