Pawan Kalyan: 'కౌన్ బనేగా కరోర్‌పతి'లో ప‌వ‌న్ క‌ల్యాణ్‌పై ప్ర‌శ్న‌.. సరైన స‌మాధానానికి రూ.1.60 లక్ష‌లు గెలుచుకునే అవ‌కాశం!

Question on AP Deputy CM Pawan Kalyan in Kaun Banega Crorepati
  • బిగ్ బీ అమితాబ్ బచ్చన్ హోస్ట్ గా 'కౌన్ బనేగా కరోర్‌పతి'
  • 2024 జూన్‌లో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఓ న‌టుడు డిప్యూటీ సీఎంగా బాధ్య‌తలు చేప‌ట్టారు. ఆయ‌న ఎవ‌రు? అంటూ ప్రశ్న 
  • ఆప్ష‌న్లుగా ప‌వ‌న్ క‌ల్యాణ్‌, చిరంజీవి, నాగార్జున‌, నంద‌మూరి బాల‌కృష్ణ పేర్లు చెప్పిన అమితాబ్  
బిగ్ బీ అమితాబ్ బచ్చన్ హోస్ట్ గా నిర్వహిస్తున్న కౌన్ బనేగా కరోర్‌పతిలో కంటెస్టెంట్ల‌కు జ‌న‌సేన అధినేత‌ ప‌వ‌న్ క‌ల్యాణ్‌కు సంబంధించిన ప్ర‌శ్న వ‌చ్చింది. అందులో భాగంగా '2024 జూన్‌లో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఓ న‌టుడు డిప్యూటీ సీఎంగా బాధ్య‌తలు చేప‌ట్టారు. ఆయ‌న ఎవ‌రు?' అని అడిగారు. 

దీనికి ఏ, బీ, సీ, డీ ఆప్ష‌న్లుగా ప‌వ‌న్ క‌ల్యాణ్‌, చిరంజీవి, నాగార్జున‌, నంద‌మూరి బాల‌కృష్ణ పేర్లు ఉన్నాయి. అయితే, కంటెస్టెంట్ల‌కు స‌రైన‌ స‌మాధానం తెలియ‌క‌పోవ‌డంతో వారు ఆడియ‌న్స్ పోల్‌కు వెళ్లారు. ఆడియ‌న్స్ అంద‌రూ ఆప్ష‌న్ 'ఏ'లోని ప‌వ‌న్ క‌ల్యాణ్ పేరు చెప్పారు. 

దాంతో కంటెస్టెంట్లు కూడా అదే ఆప్ష‌న్ ఎంచుకున్నారు. ఈ ప్ర‌శ్న విలువ రూ. 1.60ల‌క్ష‌లు కావ‌డం గ‌మ‌నార్హం. స‌మాధానం క‌రెక్ట్ అయిన త‌ర్వాత‌.. కంటెస్టెంట్ల‌కు ప‌వ‌న్ గురించి వివ‌రించారు హోస్ట్ అమితాబ్‌. దీని తాలూకు వీడియో ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్ అవుతోంది. జ‌న‌సేనాని అభిమానులు ఈ వీడియోను తెగ షేర్ చేస్తున్నారు.
Pawan Kalyan
Kaun Banega Crorepati
Amitabh Bachchan

More Telugu News