ఇకపై ఆ బాధ్యతలు ట్రాన్స్ జెండర్లకు...! రేవంత్ సర్కారు యోచన
- హైదరాబాద్ నగరంలో రోజురోజుకు పెరుగుతున్న వాహనాల సంఖ్య
- రద్దీ సమయాల్లో వాహనదారులకు ట్రాఫిక్ కష్టాలు
- ట్రాఫిక్ నియంత్రణకు వాలంటీర్లుగా ట్రాన్స్ జెండర్ల సేవలు వినియోగించుకోవాలని సూచించిన సీఎం రేవంత్ రెడ్డి
ఈ సందర్భంలో సీఎం రేవంత్ రెడ్డి ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు పలు సూచనలు చేశారు. ట్రాఫిక్ విధుల నిర్వహణకు ట్రాన్స్ జెండర్లను వాలంటీర్లుగా ఉపయోగించుకునే అంశాన్ని పరిశీలించాలని ఉన్నతాధికారులకు సీఎం రేవంత్ సూచించారు. హోంగార్డు తరహాలో వారికి ఉపాధి అవకాశాలను కల్పించే అంశంపై పరిశీలన చేయాలన్నారు. ట్రాఫిక్ వాలంటీర్లుగా సేవలు అందించేందుకు ఆసక్తిగా ఉన్న ట్రాన్స్ జెండర్ల వివరాలను సేకరించాలని, వారి అభిప్రాయాలను తీసుకోవాలని సీఎం రేవంత్ కోరారు.