Tejaswini: సీఎం రేవంత్ రెడ్డిని కలిసి బాలకృష్ణ తరఫున విరాళం అందించిన చిన్న కుమార్తె తేజస్విని

Balakrishna daughter Tejaswini handed over the donation to CM Revanth Reddy behalf of her father
  • ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో వరదలు
  • కోటి రూపాయల విరాళం ప్రకటించిన బాలకృష్ణ
  • నిన్న ఏపీ సీఎం చంద్రబాబును కలిసి రూ.50 లక్షల చెక్ అందజేసిన బాలయ్య
టాలీవుడ్ అగ్ర కథానాయకుడు, హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఇటీవల తెలుగు రాష్ట్రాలను వరదలు కుదిపేసిన నేపథ్యంలో, రెండు రాష్ట్రాలకు కోటి రూపాయల విరాళం ప్రకటించారు. నిన్ననే బాలకృష్ణ అమరావతి వచ్చి సీఎం చంద్రబాబుకు రూ.50 లక్షల చెక్ అందజేశారు. 

ఈ క్రమంలో, బాలకృష్ణ చిన్న కుమార్తె తేజస్విని నేడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. తన తండ్రి బాలకృష్ణ తరఫున రూ.50 లక్షల చెక్ ను సీఎం రేవంత్ రెడ్డికి అందించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా పాల్గొన్నారు.
Tejaswini
Balakrishna
Revanth Reddy
Donation
Floods
Telangana

More Telugu News