Jogi Ramesh: ముందస్తు బెయిల్ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించిన జోగి రమేశ్ 

Jogi Ramesh files anticipatory bail plea in Supreme Court
  • చంద్రబాబు నివాసంపై దాడి కేసు
  • ముందస్తు బెయిల్ కోసం జోగి రమేశ్ తీవ్ర ప్రయత్నాలు
  • ఏపీ హైకోర్టులో చుక్కెదురు
  • హైకోర్టు నిర్ణయాన్ని సుప్రీంలో సవాల్ చేసిన జోగి రమేశ్
చంద్రబాబు నివాసంపై దాడి కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి జోగి రమేశ్ ముందస్తు బెయిల్ కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ముందస్తు బెయిల్ కోసం జోగి రమేశ్ తాజాగా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. 

ఏపీ హైకోర్టు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. జోగి రమేశ్ ముందస్తు బెయిల్ పిటిషన్ ను హైకోర్టు తిరస్కరించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, జోగి రమేశ్ పిటిషన్ ను సుప్రీంకోర్టు రేపు (సెప్టెంబరు 12) విచారించే అవకాశాలు ఉన్నాయి.
Jogi Ramesh
Anticipatory Bail Plea
Supreme Court
YSRCP

More Telugu News