సరిగ్గా ఇదే రోజున ఇండియా వర్సెస్ ఇంగ్లండ్ మ్యాచ్.. ప్రారంభానికి 90 నిమిషాల ముందు ఎందుకు రద్దయిందో తెలుసా?
- పటౌడీ ట్రోఫీలో భాగంగా భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య ఐదు టెస్టుల సిరీస్
- ఓల్డ్ ట్రాపోర్డ్లో ఐదు టెస్టు ప్రారంభానికి ముందు భారత శిబిరంలో కొవిడ్ కలకలం
- మ్యాచ్‌ను రద్దు చేసి అభిమానులకు క్షమాపణలు
- ఏడాది తర్వాత జులై 2022లో జరిగిన రీషెడ్యూల్ మ్యాచ్‌లో ఇంగ్లండ్ విజయం
ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో భారత జట్టు అప్పటికే 2-1 ఆధిక్యంతో ఉండి ఇంగ్లండ్‌లో చారిత్రక విజయానికి దగ్గర్లో ఉంది. మ్యాచ్ జరిగితే తమ క్యాంపులోని ఆటగాళ్లు కూడా కరోనా బారినపడే అవకాశం ఉందని ఈసీబీ తెలిపింది. ఈ నేపథ్యంలో మ్యాచ్‌ను నిలిపివేశారు. దీంతో అభిమానులకు క్షమాపణలు చెప్పారు. రద్దయిన ఆ మ్యాచ్‌ను ఏడాది తర్వాత జులై 2022లో నిర్వహించారు. ఈ మ్యాచ్‌లో భారత ఓటమి పాలు కావడంతో సిరీస్ డ్రా అయింది.