Sanket Bawankule: మద్యం మత్తులో తన ఆడి కారుతో పలు వాహనాలను ఢీకొట్టి పరారైన మహారాష్ట్ర బీజేపీ చీఫ్ కుమారుడు

Maharashtra BJP chief Chandrashekhar son flees after his Audi hits several vehicles in Nagpur
  • బార్ నుంచి వస్తూ పలు వాహనాలను ఢీకొట్టిన సంకేత్ బవాంకులే
  • ఘటన తర్వాత ముగ్గురు పరార్.. మద్యం మత్తులో ఉన్న ఇద్దరి అరెస్ట్
  • ఆ కారు తన కుమారుడి పేరుపైనే రిజిస్టర్ అయి ఉందన్న బీజేపీ మహారాష్ట్ర చీఫ్ చంద్రశేఖర్
  • చట్టం అందరికీ సమానమేనని, పోలీసులు విచారణ జరిపి నిందితులకు శిక్ష విధించాలన్న చంద్రశేఖర్
తన ఆడి కారుతో నాగ్‌పూర్‌లోని రాందాస్‌పేట ప్రాంతంలో పలు వాహనాలను ఢీకొట్టిన మహారాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు చంద్రశేఖర్ బవాంకులే కుమారుడు పరారయ్యాడు. అతడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ ఘటనలో కారులో ఉన్న ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. చంద్రశేఖర్ బవాంకులే కుమారుడు సంకేత్ బవాంకులే సహా మరో ముగ్గురు పరారీలో ఉన్నట్టు పోలీసులు తెలిపారు. 

అరెస్ట్ అయిన అర్జున్ హవారే, రోణిత్ చింతాన్వర్ ఇద్దరూ ప్రమాద సమయంలో మద్యం మత్తులో ఉన్నట్టు పోలీసులు తెలిపారు. ఆడికారు తొలుత ఫిర్యాదుదారు జితేంద్ర సొంకాంబలే కారును తెల్లవారుజామున ఒంటిగంట సమయంలో ఢీకొట్టింది. ఆ తర్వాత ఓ మోపెడ్‌పై వెళ్తున్న మరో ఇద్దరిని ఢీకొట్టింది. ఈ ఘటనలో వారు గాయపడ్డారు. 

ప్రమాద సమయంలో కారులో సంకేత్ సహా మొత్తం ఐదుగురు ఉన్నారు. ఆ సమయంలో వారు ధరంపేట్‌లోని ఓ బారు నుంచి తిరిగి వస్తున్నట్టు పోలీసులు నిర్ధారించారు. సొంకాంబలే ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకుని ఇద్దరిని అరెస్ట్ చేసిన పోలీసులు ఆ తర్వాత బెయిలుపై వారిని విడిచిపెట్టారు. ఆ కారు తన కుమారుడి పేరుపైనే రిజిస్టర్ అయి ఉన్నట్టు బీజేపీ మహారాష్ట్ర చీప్ చంద్రశేఖర్ తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు నిష్పక్షపాత విచారణ చేపట్టి, నిందితులకు తగిన శిక్ష విధించాలని డిమాండ్ చేశారు. చట్టం అందరికీ సమానమేనని, తాను ఏ పోలీసు అధికారితోనూ మాట్లాడలేదని తెలిపారు.
Sanket Bawankule
Nagapur
Maharashtra
BJP Chief
Audi Car

More Telugu News