Prakasam Barriage: ప్రకాశం బ్యారేజ్ ను బోట్లు ఢీకొన్న కేసు... నిందితులకు రిమాండ్

Accused in boats hitting Prakasam Barriage case sent to remand
  • బోట్లు ఢీకొన్న కేసులో ఇద్దరిని అరెస్ట్ చేసిన పోలీసులు
  • నిందితులు ఉషాద్రి, రామ్మోహన్ లకు 14 రోజుల రిమాండ్
  • విజయవాడలోని జిల్లా జైలుకు నిందితుల తరలింపు
ప్రకాశం బ్యారేజీని భారీ బోట్లు ఢీకొట్టిన ఘటనలో విజయవాడ పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. కుక్కలగడ్డకు చెందిన ఉషాద్రి, సూరాయపాలెంకు చెందిన కోమటిరెడ్డి రామ్మోహన్ ను అదుపులోకి తీసుకున్నారు. వీరిని విజయవాడ కోర్టులో ప్రవేశపెట్టారు. కేసును విచారించిన కోర్టు... ఇద్దరు నిందితులకు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో నిందితులను పోలీసులు జిల్లా జైలుకు తరలించారు. 

మరోవైపు బ్యారేజ్ ను ఢీకొన్న బోట్లకు వైసీపీ రంగులు ఉండటంతో... ఈ ఘటన వెనుక కుట్ర కోణం ఉండొచ్చేమోనని పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితులకు కోర్టు రిమాండ్ విధించడంతో... ఘటనపై లోతైన దర్యాప్తు జరిపేందుకు నిందితులను పోలీసులు కస్టడీకి కోరే అవకాశం ఉంది.
Prakasam Barriage
Boats
Remand

More Telugu News