Kambhampati Hari Babu: మిజోరం గవర్నర్‌ కంభంపాటి హరిబాబుకు అస్వస్థత

Mizoram Governor Haribabu is ill andHe was rushed to the hospital
  • హైదరాబాద్ పర్యటనలో ఉన్న హరిబాబు
  • ఎయిర్ పోర్టులో ఉండగా అస్వస్థత
  • గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి ఎయిర్‌పోర్ట్ నుంచి హుటాహుటిన హాస్పిటల్‌కు తరలింపు
మిజోరం రాష్ట్ర గవర్నర్ కంభంపాటి హరిబాబు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. హైదరాబాద్ పర్యటనలో ఉన్న ఆయన శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఉండగా హఠాత్తుగా అస్వస్థతకు గురైనట్టు తెలుస్తోంది. దీంతో ఆయనను వెంటనే ఎయిర్ పోర్ట్ నుంచి గచ్చిబౌలిలోని స్టార్ ఆసుపత్రికి తరలించారు. ఆయనను తరలించడం కోసం ఎయిర్ పోర్ట్ నుంచి ఆసుపత్రి వరకు గ్రీన్ ఛానల్ ను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఆయనకు చికిత్స కొనసాగుతోంది.

కాగా కంభంపాటి హరిబాబు 2014 నుంచి 2019 వరకు బీజేపీ ఎంపీగా ఉన్నారు. ఆ సమయంలో ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా కూడా ఆయన బాధ్యతలు నిర్వహించారు. అనంతరం 2021లో మిజోరం గవర్నర్‌గా హరిబాబు నియమితులయ్యారు. అప్పటి నుంచి ఆ రాష్ట్ర గవర్నర్‌గా ఆయన కొనసాగుతున్నారు.
Kambhampati Hari Babu
BJP
Mizoram
Andhra Pradesh

More Telugu News