Sam Pitroda: రాహుల్ గాంధీ ‘పప్పు’ కాదు: శామ్ పిట్రోడా

Rahul Gandhi is no Pappu Congress Sam Pitroda praise at Texas event
  • అమెరికాలోని డాలస్ లో రాహుల్ పై ప్రశంసలు
  • ఉన్నత విద్యావంతుడు, దార్శనికుడంటూ పొగడ్త
  • కొన్నిసార్లు ఆయనను అర్థం చేసుకోవడం కష్టమని వెల్లడి
కాంగ్రెస్ అగ్రనేత, లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీపై ఆ పార్టీ నేత శామ్ పిట్రోడా ప్రశంసల జల్లు కురిపించారు. ఆయనను కొందరు ఎగతాళి చేస్తున్నట్టుగా ఆయనేమీ 'పప్పు' కాదని, ఉన్నత విద్యావంతుడని వివరించారు. అమెరికాలోని డాలస్ లో జరిగిన ఓ కార్యక్రమంలో రాహుల్ గాంధీ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ పార్టీ చైర్మన్ శామ్ పిట్రోడా పాల్గొని మాట్లాడారు. రాహుల్ గాంధీ ఉన్నత విద్యావంతుడు, చదువరి, లోతైన ఆలోచనాపరుడని పిట్రోడా చెప్పారు. రాహుల్ ఆలోచనల లోతును ఒక్కోసారి అర్థం చేసుకోలేమని వివరించారు.

ఏ అంశంపైనైనా లోతుగా ఆలోచించే వ్యూహకర్త, రాహుల్ ను అర్థం చేసుకోవడం అంత సులభం కాదన్నారు. అయితే, ఆయనపై బీజేపీ తప్పుడు ప్రచారం చేస్తోందని, కోట్లు కుమ్మరించి మరీ రాహుల్ ను కించపరుస్తోందని శామ్ పిట్రోడా మండిపడ్డారు. కాగా, రాహుల్ గాంధీ అమెరికాలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఆదివారం టెక్సాస్ లోని డాలస్ విమానాశ్రయానికి చేరుకున్న రాహుల్ కు ఎన్ఆర్ఐలు ఘనంగా స్వాగతించారు.
Sam Pitroda
Rahul Gandhi
Texas
Dallas
NRI

More Telugu News