సున్నం చెరువులో హైడ్రా కూల్చివేతలు.. బాధితుల ఆక్రోశం.. వైరల్ వీడియో
- కోర్టుకు వెళ్లాం.. అయినా కూల్చివేస్తున్నారంటూ మహిళ కన్నీళ్లు
- కూల్చివేతలు జరిగే చోట ఉద్రిక్తత
- బాధితులను దూరంగా పంపిస్తున్న పోలీసులు
ఈ సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను పొగుడుతూ ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డిపై మండిపడింది. ఆ మహానుభావుడు (కేసీఆర్ ను ఉద్దేశించి) 28 రోజులు నిరాహార దీక్ష చేసి తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చాడని గుర్తుచేసింది. ‘ఏం బాబూ నువ్వు ఎందుకు వచ్చావు. మా కడుపులు కొట్టడానికి వచ్చావా? కేసీఆర్ తెలంగాణను తెచ్చాడు. నువ్వేం తెచ్చావు? మా కడుపు కొట్టి ఇళ్లను కూల్చడానికి వచ్చావు. ఏదైనా మంచిపని చేసి శభాష్ అనిపించుకో’ అంటూ సీఎం రేవంత్ రెడ్డి పేరు ప్రస్తావించకుండా సదరు మహిళ విమర్శించింది.