Kolkata Horror: కోల్‌కతా హత్యాచార ఘటన: సహ నిందితుడితో ఆర్‌జీ కర్ ఆసుపత్రి మాజీ ప్రిన్సిపల్‌కు నేరపూరిత సంబంధాలు

RG Kar Hospital Ex Principal Sandip Ghosh Had Criminal Nexus With Co Accused
  • ఆసుపత్రి ప్రిన్సిపాల్, ఇద్దరు వ్యాపారులు, ఆయన సెక్యూరిటీ గార్డును ఇప్పటికే అరెస్ట్ చేసిన సీబీఐ
  • వారితో ఘోష్‌కు నేరపూరిత సంబంధాలున్నాయన్న అధికారులు
  • వ్యాపారులు, సెక్యూరిటీ గార్డు భార్యకు లబ్ధి చేకూర్చేలా కాంట్రాక్ట్‌లు ఇచ్చినట్టు సీబీఐ ఆరోపణ
కోల్‌కతాలో జూనియర్ వైద్యురాలిపై జరిగిన లైంగికదాడి,  హత్య కేసులో రోజుకో విషయం బయటకొస్తూ సంచలనమవుతోంది. ఇప్పటికే ఈ కేసులో అనుమానితుడిగా ఉన్నఆర్‌జీ కర్ ఆసుపత్రి, మెడికల్ కాలేజీ మాజీ ప్రిన్సిపల్ సందీప్‌ ఘోష్‌.. సహ నిందితుతులతో నేరపూరిత సంబంధం నెరిపినట్టు ఈ కేసును దర్యాప్తు చేస్తున్న సీబీఐ తెలిపింది. కాలేజీలో జరిగిన ఆర్థిక అవకతవకలపై దర్యాప్తు చేస్తుండగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

ఇప్పటి వరకు జరిగిన దర్యాప్తులో భాగంగా ఇందుకు సంబంధించిన సాక్ష్యాలు సంపాదించినట్టు సీబీఐ తెలిపింది. సహ నిందితులతో డాక్టర్ సందీప్ ఘోష్‌కు ఉన్న నేరపూరిత సంబంధం ప్రభుత్వానికి నష్టం చేకూర్చగా అతడికి, సహ నిందితులకు మాత్రం లబ్ధి జరిగిందని వివరించింది.

ఆసుపత్రిలో ఆర్థిక అవకతవకలకు సంబంధించి  సీబీఐ ఇప్పటికే ఘోష్, ఇద్దరు వ్యాపారులు, అతడి సెక్యూరిటీ సిబ్బందిని అరెస్ట్ చేశారు. ముర్షీదాబాద్ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో పనిచేస్తున్నప్పటి నుంచే అరెస్ట్ అయిన ఇద్దరు వ్యాపారులతో ఘోష్‌కు సంబంధాలున్నాయని సీబీఐ పేర్కొంది. వారితో ఘోష్‌కు ఉన్న సన్నిహిత సంబంధం కారణంగానే ఆర్‌జీ కాలేజీకి మెటీరియల్ సరఫరా చేసే కాంట్రాక్ట్‌లు దక్కించుకున్నారని తెలిపింది. అంతేకాదు,  తన సెక్యూరిటీ గార్డు భార్య సంస్థకు ఆసుపత్రిలో కేఫ్ కాంట్రాక్ట్ ఇచ్చినట్టు సీబీఐ పేర్కొంది.
Kolkata Horror
RG Kar Hospital
Sandip Ghosh
Crime News

More Telugu News