Mallu Bhatti Vikramarka: మరోసారి భారీ వర్షం... వెంటనే ఖమ్మం బయల్దేరిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

Bhatti Vikramarka leaves for Khammam after heavy rain lashed district
  • ఖమ్మం జిల్లాలో ఇవాళ విస్తారంగా వర్షాలు
  • 15 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు
  • మున్నేరుకు మరోసారి వరద వచ్చే అవకాశం
  • అధికారులను అప్రమత్తం చేసిన భట్టి విక్రమార్క
ఇటీవల ఖమ్మం పట్టణాన్ని వరద అతలాకుతలం చేయడం తెలిసిందే. ఇవాళ ఖమ్మం జిల్లాలో విస్తారంగా వర్షాలు కురవడంతో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెంటనే ఖమ్మం బయల్దేరి వెళ్లారు. 

మున్నేరు వాగు మరోసారి పొంగి పొర్లే అవకాశం ఉందన్న అంచనాల నేపథ్యంలో భట్టి విక్రమార్క అధికారులను అప్రమత్తం చేశారు. ఖమ్మం జిల్లాలో ఇవాళ ఒక్కరోజే 15 సెం.మీ వర్షపాతం నమోదు కావడంతో, మున్నేరుకు భారీ వరద వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. 

ముందుజాగ్రత్తగా లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని భట్టి విక్రమార్క ఆదేశించారు. కాగా, మున్నేరులో నీటి ప్రవాహం అంతకంతకు పెరుగుతుండడం పట్ల ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.
Mallu Bhatti Vikramarka
Khammam District
Heavy Rain
Munneru
Flood
Congress
Telangana

More Telugu News