Chandrababu: విజయవాడ కలెక్టరేట్ లో వినాయక పూజలో పాల్గొన్న సీఎం చంద్రబాబు

CM Chandrababu attends Vinayaka Pooja at Vijayawada collectorate
  • వరద సహాయక చర్యల పర్యవేక్షణతో సీఎం చంద్రబాబు బిజీ
  • నేడు వినాయకచవితి
  • జిల్లా కలెక్టర్ కార్యాలయంలోనే పండుగ జరుపుకున్న చంద్రబాబు
వరద ముంపు ప్రాంతాల పరిశీలన, సహాయక చర్యల పర్యవేక్షణతో గత కొన్ని రోజులుగా ఏపీ సీఎం చంద్రబాబు క్షణం తీరిక లేకుండా ఉన్నారు. విజయవాడ వరద గుప్పిట్లో చిక్కుకున్నప్పటి నుంచి ఆయన విజయవాడ కలెక్టరేట్ తన నివాసంగా చేసుకున్నారు. అక్కడి నుంచే కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు. 

ఈ నేపథ్యంలో, చంద్రబాబు ఇవాళ వినాయక చవితి పండుగను తన నివాసంలో కాకుండా విజయవాడ కలెక్టరేట్ లోనే జరుపుకున్నారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన వినాయక మండపం వద్ద గణేశుని పూజలో పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా వేదపండితులు సీఎంకు ఆశీర్వచనం అందించారు. ఈ పూజలో చంద్రబాబుతో పాటు మంత్రులు, అధికారులు కూడా పాల్గొన్నారు.
Chandrababu
Vinayaka Chavithi
Collectorate
Vijayawada

More Telugu News