Swiggy: స్విగ్గీలో రూ.33 కోట్లు దారి మళ్లించిన మాజీ ఉద్యోగి!

Swiggy discloses Rs 33 crore fraud by ex junior employee
  • 2023-24 వార్షిక నివేదికలో వెల్లడించిన స్విగ్గీ
  • అనుబంధ సంస్థకు చెందిన మాజీ ఉద్యోగి కోట్లాది రూపాయలు మళ్లించినట్లుగా గుర్తించిన స్విగ్గీ
  • చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేసిన స్విగ్గీ
తమ సంస్థలో పని చేసిన మాజీ ఉద్యోగి ఒకరు తాను ఉద్యోగం చేసిన సమయంలో రూ.33 కోట్ల మేర దారి మళ్లించినట్లు ప్రముఖ ఫుడ్ డెలివరీ యాప్ స్విగ్గీ వెల్లడించింది. దీనిపై స్విగ్గీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. 

స్విగ్గీ 2023-24 వార్షిక నివేదికను సంస్థ ఉన్నతాధికారులు పరిశీలించారు. ఈ సందర్భంగా ఓ అనుబంధ సంస్థకు చెందిన మాజీ ఉద్యోగి కంపెనీ నుంచి రూ.33 కోట్లు మళ్లించినట్లుగా వారు గుర్తించారు.

ఈ అంశంపై స్విగ్గీ అంతర్గతంగా దర్యాఫ్తు చేసేందుకు కొందరు సభ్యులతో బృందాన్ని నియమించింది. అలాగే కోట్లాది రూపాయలు దారి మళ్లించినందుకు చర్యలు తీసుకోవాలని కోరుతూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ విషయాన్ని రెండు రోజుల క్రితం విడుదల చేసిన వార్షిక నివేదికలో స్విగ్గీ వెల్లడించిందని మీడియాలో కథనాలు వచ్చాయి. అయితే స్విగ్గీ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
Swiggy
Employee
Fraud
Crime News

More Telugu News