Daggubati Purandeswari: వారు చేసిన పాపాన్ని పక్కవారికి అంటకడుతున్నారు: పురందేశ్వరి

Purandeswari fires on YSRCP
  • ప్రతి సందర్భాన్ని రాజకీయం చేయడం వైసీపీ నేతలకు తగదన్న పురందేశ్వరి
  • గత వైసీపీ ప్రభుత్వం బుడమేరు పనులను నిర్లక్ష్యం చేసిందని విమర్శ
  • వరద నష్టాన్ని కేంద్రం అంచనా వేసి సాయం అందిస్తుందని వ్యాఖ్య
ప్రతి సందర్భాన్ని రాజకీయం చేయడం తగదని వైసీపీ నేతలకు ఏపీ బీజేపీ చీఫ్ పురందేశ్వరి హితవు పలికారు. ప్రజల ప్రాణాలు పోతున్న సమయంలో కూడా రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. గత వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే బుడమేరుకు గండి పడిందని చెప్పారు. 

గతంలో టీడీపీ ప్రభుత్వం రూ. 400 కోట్లతో బుడమేరు పటిష్టతకు పనులు చేపట్టిందని తెలిపారు. 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం పనులు పూర్తి చేయకుండా నిర్లక్ష్యం చేసిందని పురందేశ్వరి విమర్శించారు. 

బుడమేరు పనులను వైసీపీ ప్రభుత్వం పూర్తి చేసి ఉంటే ఇంత విపత్తు సంభవించేది కాదని అన్నారు. వారు చేసిన పాపాన్ని పక్కవారికి అంటకడుతున్నారని దుయ్యబట్టారు. భారీ వర్షాల కారణంగా ఎంత నష్టం వాటిల్లిందో కేంద్ర ప్రభుత్వం అంచనా వేసి సాయం అందిస్తుందని చెప్పారు.
Daggubati Purandeswari
BJP
YSRCP
Budameru

More Telugu News