Chandrababu: చంద్రబాబుకు త్రుటిలో తప్పిన ప్రమాదం

Chandrababu narrowly escaped unhurt
 
ఏపీ సీఎం చంద్రబాబుకు త్రుటిలో ప్రమాదం తప్పింది. చంద్రబాబు ఈ మధ్యాహ్నం బుడమేరు ప్రవాహాన్ని పరిశీలించేందుకు మధురానగర్ వెళ్లారు. వరద నీరు సరిగా కనిపించకపోవడంతో రైల్వే ట్రాక్ పైకి ఎక్కారు. ఆయన వెంట చంద్రదండు కార్యకర్తలు కూడా నడిచారు. 

చంద్రబాబు కాలినడకన రైలు వంతెన పైకి వెళ్లి బుడమేరును పరిశీలించారు. వంతెనపై చంద్రబాబు నడుస్తుండగానే, ఓ రైలు ఎదురుగా వచ్చింది. దాంతో అందరూ తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఆయనకు కేవలం మూడు అడుగుల సమీపం నుంచి రైలు వెళ్లింది.

చంద్రబాబు ట్రాక్ కు కొంచెం పక్కగా నిలబడడంతో ప్రమాదం తప్పినట్టుయింది. రైలు తనకు తగలకుండా చంద్రబాబు వంతెనపై ఎంతో జాగ్రత్తగా నిలుచుకున్నారు. చంద్రబాబు సేఫ్ గా ఉండడంతో అధికారులు, పార్టీ నేతలు ఊపిరి పీల్చుకున్నారు.
Chandrababu
Railway Track
Budameru
Madhuranagar
Vijayawada

More Telugu News