Jogi Ramesh: జోగి రమేశ్ కోసం హైదరాబాదులో ఏపీ పోలీసుల గాలింపు

AP police searches for YCP leader Jogi Ramesh in Hyderabad
  • చంద్రబాబు నివాసంపై దాడి కేసులో నిందితుడిగా ఉన్న జోగి రమేశ్
  • జోగి రమేశ్ కు హైకోర్టులో చుక్కెదురు
  • ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేత
  • అజ్ఞాతంలోకి జోగి రమేశ్
  • మూడు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించిన ఏపీ పోలీస్ శాఖ
గత ప్రభుత్వ హయాంలో చంద్రబాబు నివాసంపై దాడి కేసులో నిందితుడిగా ఉన్న వైసీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేశ్ అజ్ఞాతంలో ఉన్న సంగతి తెలిసిందే. ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్ ను ఏపీ హైకోర్టు కొట్టివేసిన నేపథ్యంలో, ఆయన అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. 

ఈ నేపథ్యంలో, జోగి రమేశ్ తో పాటు ఆయన అనుచరుల కోసం ఏపీ పోలీసులు హైదరాబాదులో గాలిస్తున్నారు. జోగి రమేశ్ కోసం ఏపీ పోలీసులు మూడు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. 

అటు, టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో నిందితుడిగా ఉన్న దేవినేని అవినాశ్ కూడా అజ్ఞాతంలోకి వెళ్లారు. నందిగం సురేశ్ ను పోలీసులు అరెస్ట్ చేయడంతో ఆయా కేసుల్లో నిందితులుగా ఉన్న ఇతర వైసీపీ నేతలు ముందే జాగ్రత్త పడినట్టు తెలుస్తోంది.
Jogi Ramesh
Police
Hyderabad
Chandrababu
AP High Court
YSRCP

More Telugu News