Himalayas: హిమాలయ మంచు పొరల కింద ఎన్ని వందల రకాల వైరస్ లో!

nearly 1700 ancient virus species found in guliya glacier of himalayas
  • హిమాలయ మంచు పొరల్లో ప్రాచీన వైరస్‌ను గుర్తించిన శాస్త్రవేత్తలు
  • అమెరికాలోని ఓహియా స్టేట్ యూనివర్శిటీ ప్రొఫెసర్ జీ పింగ్ జాంగ్ నేతృత్వంలో అధ్యయనం
  • నేచర్ జియోసైన్స్ జర్నల్ లో వివరాలను వెల్లడించిన శాస్త్రవేత్తలు
హిమాలయ మంచు పొరల కింద అనేక రకాల వైరస్ జాతుల అనవాళ్లు ఉన్నాయి. సుమారు 17వేల ప్రాచీన వైరస్ జాతుల ఆనవాళ్లను అమెరికా శాస్త్రవేత్తలు గుర్తించారు. టిబెట్ పీఠభూమిలో ఉన్న గలియా నుండి పర్వతాల్లో ఆ వైరస్‌లు ఉన్నట్లు కనుగొన్నారు. కొన్ని వైరస్‌లు సుమారు 40 సంవత్సరాల క్రితం నాటివిగా ఉన్నట్లు భావిస్తున్నారు. అమెరికాలోని ఓహియో స్టేట్ యూనివర్శిటీకి చెందిన ప్రొఫెసర్ జీ పింగ్ జాంగ్ నేతృత్వంలో శాస్త్రవేత్తల బృందం ఆ వైరస్‌‌పై రీసెర్చ్ జరిపింది. నేచర్ జియోసైన్స్ జర్నల్ లో నివేదికను ప్రచురించారు. శతాబ్దాలుగా వాతావరణ పరిస్థితులు మారుతుంటే, ఆ వాతావరణానికి తగినట్లుగా ఎలా ఆ వైరస్ తట్టుకున్నాయి? అనే విషయాలను నివేదికలో పేర్కొన్నారు. 
 
వేల సంవత్సరాల నుండి పేరుకుపోయిన మంచుగడ్డల్లోని పొరలను అధ్యయనం చేసేందుకు ఐస్ కోర్‌లను డ్రిల్ చేసి తీసిన శ్యాంపిల్స్‌ను శాస్త్రవేత్తలు పరీక్షించారు. గులియా గ్లేసియర్‌లోని సుమారు 310 మీటర్ల లోతైన ఐస్ కోర్ నుండి మంచు శాంపిల్స్‌ను సేకరించి పరీక్షలు చేశారు. ప్రతి పొరలోనూ కీలకమైన పర్యావరణ సమాచారం ఉన్నట్లు శాస్త్రవేత్తలు తెలిపారు.  నూతన టెక్నాలజీ ద్వారా వైరస్‌లకు చెందిన డీఎన్ఏలను పరీక్ష చేయగా, సుమారు 1705 రకాల విభిన్న వైరస్ జాతులను గుర్తించారు.
Himalayas
Virus Species
National News

More Telugu News