kenya: ఒలింపిక్ రన్నర్ రెబెక్కాపై పెట్రోల్ పోసి నిప్పంటించిన బాయ్ ఫ్రెండ్

olympic marathan runner set on fire by her boyfriend in kenya
  • డిక్కన్ డియెమ మరగచ్‌తో కొన్ని రోజులుగా సహజీవనం చేస్తున్న రెబెక్కా చెప్టెగీ
  • 75 శాతం కాలిన గాయాలతో ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడుతున్న రెబక్కా
  • ఆగ్రహం వ్యక్తం చేసిన ఒలింపిక్ సంఘం 
పారిస్ ఒలింపిక్స్ లో పాల్గొన్న మారథాన్ రన్నర్ కు ప్రియుడు ఊహించని షాక్ ఇచ్చాడు. ఉగండాకు చెందిన రెబెక్కా చెప్టెగీ గత కొన్ని రోజులుగా కెన్యాకు చెందిన డిక్కన్ డియెమ మరగచ్ తో సహజీవనం చేస్తోంది. ఈ క్రమంలో తరచు ఆమెను వేధింపులకు గురి చేస్తున్న మరగచ్ ఇటీవల ఆమె వంటిపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. దీంతో మంటల ధాటికి రెబెక్కా హాహాకారాలు చేయడంతో స్థానికులు ఆమెను కెన్యాలోని ఆసుపత్రికి తరలించారు. 

75 శాతం కాలిన గాయాలతో ఆమె ఇప్పుడు ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడుతోంది. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. రెబెక్కాపై దాడి విషయం తెలిసి ఉగాండా ప్రజలతో పాటు ఒలింపిక్ సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. కెన్యా పోలీసులు.. డెయెమ మరగచ్ పై గృహహింస, హత్యాయత్నం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
kenya
Olympic Marathan Runner

More Telugu News