Hardik Pandya: హఠాత్తుగా ముంబయిలో ప్రత్యక్షమైన హార్దిక్ పాండ్యా మాజీ భార్య నటాషా

hardik pandya ex wife natasa stankovic returns to mumbai shares photos
  • తన స్వదేశం సెర్బియాలో అగస్త్య నాల్గవ పుట్టిన రోజు వేడుకలను ఘనంగా నిర్వహించిన నటి నటాషా
  • కుమారుడు అగస్త్యని గుర్తు చేసుకుంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన హర్ధిక్ పాండ్యా
  • తిరిగి ముంబయిలో ప్రత్యక్షమై ఫోటోలను ఇన్ స్టాలో షేర్ చేసిన నటాషా  
టీమిండియా స్టార్ క్రికెటర్ హార్దిక్ పాండ్యా మాజీ భార్య నటాషా స్టాంకోవిచ్ తాజాగా ముంబయిలో ప్రత్యక్షం కావడం ఆసక్తికరంగా మారింది. 2020 మే 31న కరోనా సమయంలో హర్ధిక్ పాండ్య, నటాషా ప్రేమ వివాహం చేసుకున్నారు. వారికి అదే ఏడాది బాలుడు (అగస్త్య) పుట్టాడు. ఆ తర్వాత వారి మధ్య విభేదాలు రావడంతో విడిపోయారు. తాము విడిపోవాలని పరస్పరం నిర్ణయించుకున్నామని ఇద్దరూ అప్పట్లో సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. అయితే కో పేరెంట్స్ గా ఆగస్త్యకి తాము చేయాల్సింది అంతా చేస్తామని పేర్కొన్నారు. 

హార్దిక్ తో విడిపోయినట్లు ప్రకటించిన తర్వాత అగస్త్యను తీసుకుని నటాషా తన స్వదేశం సెర్బియా వెళ్లిపోయింది. అక్కడే కుమారుడి నాల్గవ పుట్టిన రోజు వేడుకలను ఘనంగా నిర్వహించిన నటాషా .. ఆ వేడుకకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. మరో వైపు క్రికెట్ కెరీర్ లో బిజీ గా ఉన్న హార్దిక్ పాండ్యా తన కుమారుడిని గుర్తు చేసుకుంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టాడు. ఈ తరుణంలో పాండ్యా మాజీ భార్య నటాషా మళ్లీ ముంబయికి తిరిగి రావడం ఆసక్తికరంగా మారింది. తన ముంబయి పర్యటనకు సంబంధించిన ఫోటోలను నటాషా తన ఇన్ స్టా స్టోరీస్ లో షేర్ చేసింది. అయితే ఇందులో కుమారుడు అగస్త్య కనిపించలేదు. నటాషా ముంబయికి ఎందుకు తిరిగి వచ్చింది అనే దానిపై ఇంత వరకూ క్లారిటీ లేదు.
Hardik Pandya
Natasa Stankovic
Social Media

More Telugu News