Crocodile: ఈ మొసలికి 6 భార్యలు, 10,000 పిల్లలు.. ఆశ్చర్యపోయే మరిన్ని వివరాలు ఇవే

16ft beast Henry now recognised as the worlds oldest crocodile
  • 123 సంవత్సరాల వయసుతో ప్రపంచంలో అతిపెద్ద వయసు కలిగిన మొసలిగా గుర్తింపు పొందిన హెన్రీ
  • 700 కేజీల బరువు, 16 అడుగుల పొడవుతో అతిపెద్ద మొసలిగా రికార్డు  
  • గత 30 ఏళ్లుగా దక్షిణాఫ్రికాలోని క్రోక్‌వరల్డ్ కన్జర్వేషన్ సెంటర్‌లో ఉంటున్న హెన్రీ
ఒక మొసలికి 6 భార్యలు.. 10 వేల పిల్లలు ఉన్నాయంటే నమ్మగలరా? కానీ ఇది నిజం. ఏకంగా 700 కిలోల బరువు, 16 అడుగుల భారీ పొడవున్న హెన్రీ అనే మొసలి ఈ ఘనత సాధించింది. 123 ఏళ్ల వయసుతో ప్రపంచంలోనే అతిపెద్ద మొసలిగా అది నిలిచింది. దాదాపు చిన్నసైజు బస్సు అంత ఉండే ఈ భారీ మొసలి వేలకొద్దీ పిల్లలకు కారణమైందని జూ నిర్వాహకులు చెప్పారు. కాగా అది గతంలో మనుషులను కూడా చంపుకొని తినేదని చెప్పారు.

హెన్రీ జీవిత ప్రయాణం దక్షిణాఫ్రికాలోని బోట్స్ వానాలో ఉన్న యూనెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించిన ప్రదేశమైన ఒకవాంగో డెల్టాలో ప్రారంభమైంది. డిసెంబర్ 16, 1900న ఇది పుట్టింది. దీనికి భయంకరమైన భారీ దంతాలు ఉన్నాయి. గత 30 సంవత్సరాలుగా దక్షిణాఫ్రికాలోని స్కాట్‌బర్గ్‌లో ఉన్న క్రోక్‌వరల్డ్ కన్జర్వేషన్ సెంటర్‌లో దీనిని ఉంచుతున్నారు. ఈ సెంటర్‌ను సందర్శించేవారు హెన్రీ పరిమాణం, వయస్సు తెలుసుకొని ఆశ్చర్యపోతున్నారు. అయితే గతంలో మనుషులను చంపుకొని తినే అలవాటు ఉన్న ఈ మొసలి ప్రస్తుతం ఆ అలవాటుకు దూరంగా ఉందని, మనుషులకు దూరంగా ఉంచుతున్నట్టు నిర్వాహకులు చెప్పారు. 

గతంలో బోట్సవానాలోని స్థానిక తెగ మనుషుల పిల్లలను వేటాడి తినేదని నిర్వాహకులు చెప్పారు. దీంతో ఈ మొసలి పీడను విరగడ చేయాలనే ఉద్దేశంతో స్థానికులు హెన్రీ న్యూమాన్ అనే ఫేమస్ వేటగాడిని సంప్రదించారు. దానిని చంపేయాలని స్థానికులు కోరారు. అయితే దానిని చంపేయడానికి బదులు ఆయన దానిని బంధించారు. దీంతో ఆయన పేరు మీదుగా ఆ మొసలికి హెన్రీ అనే పేరు వచ్చింది. 

కాగా హెన్రీ నైలు నది మొసలి. ఈ జాతి మొసళ్లు సబ్-సహారా ఆఫ్రికా ప్రాంతంలోని 26 దేశాలలో కనిపిస్తుంటాయి. ఈ మొసళ్లు క్రూరమైన స్వభావాన్ని కలిగి ఉంటాయి. ఈ ప్రాంతంలో వందలాది మరణాలకు ఈ జాతి మొసళ్లు కారణమవుతున్నాయని గణాంకాలు చెబుతున్నాయి.
Crocodile
Crocodile Henry
Off Beat News
Viral News

More Telugu News