Sensex: ఫ్లాట్‌గా ముగిసిన భారత స్టాక్ మార్కెట్ సూచీలు

Sensex closes flat ICICI Bank and Bajaj Finserv top gainers
  • అప్రమత్తత పాటించిన ఇన్వెస్టర్లు
  • అతి తక్కువగా 4.40 పాయింట్ల లాభంతో ముగిసిన సెన్సెక్స్
  • 2,011 షేర్లు లాభాల్లో... 1,925 షేర్లు నష్టాల్లో ముగింపు
భారత స్టాక్ మార్కెట్ సూచీలు ఈరోజు ప్లాట్‌గా ముగిశాయి. ప్రపంచ మార్కెట్ నుంచి మిశ్రమ సంకేతాలు రాగా, ఊతమిచ్చే అంశాలు లేకపోవడంతో సూచీలు ఫ్లాట్‌గా ముగిశాయి. ఇటీవల వరుసగా సూచీలు సరికొత్త గరిష్ఠాలను తాకుతూ ముందుకు సాగాయి. అయితే ఈరోజు ఇన్వెస్టర్లు అప్రమత్తత పాటించారు.

సెన్సెక్స్ 4.40 పాయింట్ల స్వల్ప వృద్ధితో 82,555 వద్ద ముగియగా... నిఫ్టీ ఒక పాయింట్ పెరిగి 5,279 వద్ద స్థిరపడింది. బీఎస్ఈలోని 2,011 షేర్లు లాభాల్లో... 1,925 షేర్లు నష్టాల్లో ముగిశాయి. 118 షేర్లలో ఎలాంటి మార్పు లేదు.

సెన్సెక్స్ 30 స్టాక్స్‌లో ఐసీఐసీఐ బ్యాంక్, బజాజ్ ఫిన్‌సర్వ్, టైటాన్, నెస్లే, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, విప్రో, ఎస్‌బీఐ, మహీంద్రా అండ్ మహీంద్రా, ఎల్ అండ్ టీ, కోటక్ మహీంద్రా, అల్ట్రాటెక్ సిమెంట్ టాప్ గెయినర్లుగా... బజాజ్ ఫైనాన్స్, ఇన్ఫోసిస్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, హెచ్‌సీఎల్ టెక్, ఇండస్‌ఇండ్ బ్యాంక్, భారతీ ఎయిర్‌టెల్ టాప్ లూజర్లుగా నిలిచాయి.

ఎన్‌ఎస్‌ఈ సూచీలలో నిఫ్టీ ఫిన్ సర్వీస్, నిఫ్టీ ఫార్మా, నిఫ్టీ ప్రైవేట్ బ్యాంక్‌లు భారీగా లాభపడ్డాయి. నిఫ్టీ ఆటో, నిఫ్టీ ఐటీ, నిఫ్టీ మెటల్, నిఫ్టీ రియాల్టీ నష్టాల్లో ముగిశాయి.
Sensex
Nifty
Stock Market

More Telugu News