Jani Master: 2034లో ప‌వ‌న్ క‌ల్యాణ్ ప్ర‌ధాని కావ‌డం ఖాయం.. ఇది రాసుకోండి: జానీ మాస్ట‌ర్

Jani Master Says Pawan Kalyan will be Prime Minister in 2034
సోమ‌వారం జ‌న‌సేన అధినేత‌, డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ పుట్టిన‌రోజు కావ‌డంతో అభిమానులు భారీ ఎత్తున వేడుక‌లు నిర్వ‌హించారు. ఈ క్ర‌మంలో ఒక‌చోట వేడుక‌ల్లో పాల్గొన్న జ‌న‌సేన నేత‌, ప్ర‌ముఖ కొరియోగ్రాఫ‌ర్ జానీ మాస్ట‌ర్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. 2034లో జ‌న‌సేనాని ప్ర‌ధాని అవుతార‌ని చెప్పుకొచ్చారు. 

జానీ మాస్ట‌ర్ మాట్లాడుతూ.. "ప‌వ‌ర్ స్టార్ ఇప్పుడు డిప్యూటీ సీఎం. 2029లో ముఖ్య‌మంత్రి అవుతారు. అలాగే 2034లో ప్ర‌ధాన‌మంత్రి అవుతారు. ఇది రాసుకోండి. జై జ‌న‌సేన" అని అన్నారు. జానీ మాస్ట‌ర్ మాట‌ల‌కు అక్క‌డున్న అభిమానులు కేరింత‌లు కొడుతూ, పీఎం పీఎం అని అర‌వ‌డం వీడియోలో ఉంది. ఇక నిన్న ప‌వ‌న్ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా 'గ‌బ్బ‌ర్ సింగ్' మూవీ రీరిలీజ్ అయిన విష‌యం తెలిసిందే. దీంతో థియేట‌ర్ల‌లో ఫ్యాన్స్ మూవీని ఎంజాయ్ చేస్తూ సంద‌డి చేశారు.
Jani Master
Pawan Kalyan
Janasena
Andhra Pradesh

More Telugu News