వరద ప్రాంతాల్లో ప్రతి ఒక్కరికీ ఆహారం అందాలి: అధికారులకు చంద్రబాబు ఆదేశాలు
- వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలపై అధికారులతో సమీక్ష
- 5 హెలికాఫ్టర్లతో ఆహార పంపిణీ చేపట్టినట్లు తెలిపిన అధికారులు
- టెలికాన్ఫరెన్స్ ద్వారా విధుల్లో ఉన్న సిబ్బందితో మాట్లాడిన ఏపీ సీఎం
వరద ప్రభావిత ప్రాంతాల్లో 5 హెలికాఫ్టర్లతో ఆహార పంపిణీ చేపట్టినట్లు అధికారులు వివరించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. రెండు రోజుల పాటు తిండి, నీరు లేకుండా ఉంటే కలిగే బాధను అర్థం చేసుకుని పనిచేయాలని చెప్పారు. బాధితులకు మూడు పూటలా ఆహారం అందించాలని, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు వెళ్లలేని చోట డ్రోన్లు, హెలికాఫ్టర్లు ఉపయోగించాలని సూచించారు. వందకు వంద శాతం ఆహార పంపిణీ జరగాలని చంద్రబాబు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.