Tirumala: భారీ వ‌ర్షాల ఎఫెక్ట్‌.. త‌గ్గిన భ‌క్తుల రద్దీ.. శీఘ్రంగా శ్రీవారి ద‌ర్శ‌నం

Less Time Taken to Tirumala Visit due to Heavy Rains in Andhra Pradesh
  • భారీ వ‌ర్షాల‌తో భ‌క్తుల రాక‌పోక‌ల‌కు అంత‌రాయం
  • ప్ర‌త్యేక ప్ర‌వేశ ద‌ర్శ‌నానికి కేవ‌లం 2 గంట‌ల స‌మ‌యం మాత్ర‌మే
  • ఉచిత స‌ర్వ‌ద‌ర్శ‌నం కోసం 5 కంపార్టుమెంట్ల‌లో వేచి ఉన్న భ‌క్తులు
  • కేవ‌లం ఆరు గంటల్లోనే శ్రీవారి ద‌ర్శ‌నం పూర్తి
ఏపీలో భారీ వ‌ర్షాల కార‌ణంగా తిరుమ‌ల‌కు భ‌క్తుల ర‌ద్దీ భారీగా త‌గ్గిపోయింది. గ‌త రెండుమూడు రోజులుగా ఎడ‌తెరిపి లేకుండా కురుస్తున్న వ‌ర్షాల కార‌ణంగా ర‌వాణా వ్య‌వ‌స్థకు అంత‌రాయం ఏర్ప‌డ‌డంతో భ‌క్తుల రాక‌పోక‌లు నిలిచిపోయాయి. దీంతో మునుప‌టి మాదిరి స్వామివారి ద‌ర్శ‌నానికి ఎక్కువ స‌మ‌యం ప‌ట్ట‌డం లేదు. కేవ‌లం 6 గంట‌ల్లోనే శ్రీవారి ద‌ర్శ‌నం పూర్తవుతోంది. 

ఉచిత సర్వదర్శనం కోసం భ‌క్తులు ఐదు కంపార్టుమెంట్లలో మాత్ర‌మే వేచి ఉన్నారు. అటు టైమ్‌ స్లాట్‌ (ఎస్‌ఎస్‌డీ) ద‌ర్శ‌నం కోసం మూడు కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉండగా.. స్వామివారి దర్శనానికి 3 గంటల సమయం పడుతుంది. అలాగే  ప్రత్యేక ప్రవేశ దర్శనం కేవ‌లం రెండు గంట‌ల‌ సమయం మాత్ర‌మే పడుతోంది. ఇక సోమవారం శ్రీవారిని 63,936 మంది భక్తులు దర్శించుకోగా, హుండీ ఆదాయం రూ. 4.55 కోట్లు వ‌చ్చింది.  
Tirumala
TTD
Andhra Pradesh

More Telugu News