Chandrababu: నిన్న రాత్రి 2 గంట‌ల వ‌ర‌కు క‌లెక్ట‌రేట్‌లోనే చంద్ర‌బాబు.. బ‌స్సులోనే బ‌స‌!

CM Chandrababu Naidu Visits Floods Effected Vijayawada Areas
  • విజ‌య‌వాడ వ‌ర‌ద ముంపు ప్రాంతాల్లో స‌హాయ‌క చ‌ర్య‌ల‌పై చంద్ర‌బాబు ప‌ర్య‌వేక్ష‌ణ‌
  • సోమ‌వారం రాత్రి 2 గంట‌ల వ‌ర‌కూ విజ‌య‌వాడ క‌లెక్ట‌రేట్‌లోనే సీఎం
  • అటు మంత్రి నారా లోకేశ్ కూడా అర్ధ‌రాత్రి దాటే వ‌ర‌కు క‌లెక్ట‌రేట్‌లోనే
సీఎం చంద్ర‌బాబు నాయుడు విజ‌య‌వాడ వ‌ర‌ద ముంపు ప్రాంతాల్లో స‌హాయ‌క చ‌ర్య‌ల‌ను ద‌గ్గ‌రుండి ప‌ర్య‌వేక్షిస్తున్నారు. స్వ‌యంగా ఆయ‌నే రంగంలోకి దిగి బాధితుల‌ను ప‌రామ‌ర్శించ‌డం, వారి స‌మ‌స్య‌ల‌ను అడిగి తెలుసుకుని కావాల్సిన సాయం అందించ‌డం చేస్తున్న విష‌యం తెలిసిందే. దీనిలో భాగంగా ముఖ్య‌మంత్రి సోమ‌వారం రాత్రి 2 గంట‌ల వ‌ర‌కూ విజ‌య‌వాడ క‌లెక్ట‌రేట్‌లోనే ఉన్నారు. 

మూడో రోజు స‌హాయ‌క చ‌ర్య‌లు, వ‌ర‌ద నిర్వ‌హ‌ణ‌ను ప‌ర్య‌వేక్షించిన చంద్ర‌బాబు.. క‌లెక్ట‌రేట్ వ‌ద్ద బ‌స్సులోనే బ‌స చేయ‌డం గ‌మ‌నార్హం. రెండు గంట‌ల త‌ర్వాత విశ్రాంతి తీసుకునేందుకు ఆయ‌న వెళ్లారు. అటు మంత్రి నారా లోకేశ్ కూడా అర్ధ‌రాత్రి దాటే వ‌ర‌కు క‌లెక్ట‌రేట్‌లోనే ఉండి, స‌హాయ చ‌ర్య‌ల‌ను ప‌ర్య‌వేక్షించారు. కాగా, నేడు విజ‌య‌వాడ‌కు అద‌న‌పు స‌హాయ‌క బృందాలు రానున్నాయి.
Chandrababu
Vijayawada
Andhra Pradesh
Floods
Heavy Rains

More Telugu News