V Srinivas Goud: సర్పంచ్‌లకు... అప్పులు చేసిన పనులకు కూడా బిల్లులు రాలేదు: శ్రీనివాస్ గౌడ్

Srinivas Goud lashes at Congress government over saranches issues
  • కాంగ్రెస్ పాలనలో సర్పంచ్‌లు ఆత్మహత్య చేసుకుంటున్నారని ఆవేదన
  • చేసిన పనులకు బిల్లులు రాక అవస్థలు పడుతున్నారని వ్యాఖ్య
  • కేంద్రం నుంచి వచ్చిన నిధులను కాంగ్రెస్ ప్రభుత్వం దారి మళ్లించిందని ఆరోపణ
అప్పులు తెచ్చి చేసిన పనులకు బిల్లులు రాకపోవడంతో సర్పంచ్‌లు (ప్రస్తుతం మాజీ సర్పంచ్‌లు) రోడ్డున పడ్డారని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ విమర్శించారు. కాంగ్రెస్ పాలనలో సర్పంచ్‎లు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 

తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... చేసిన పనులకు బిల్లులు రాక వారు బాధలు పడుతున్నారన్నారు. రూ.1,300 కోట్ల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయన్నారు.

కేంద్ర ప్రభుత్వం నుంచి పంచాయతీలకు వచ్చిన నిధులను కాంగ్రెస్ ప్రభుత్వం దారి మళ్లించిందని ఆరోపించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం సర్పంచ్‌ల మీద కక్షసాధింపు చర్యలకు ఎందుకు పాల్పడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వారి బిల్లులు వారం రోజుల్లో చెల్లించాలని, లేదంటే ఇందిరాపార్క్ వద్ద ధర్నాకు దిగుతామని హెచ్చరించారు. సర్పంచ్‌లకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.

V Srinivas Goud
BRS
Congress

More Telugu News