Kadapa: కడప అమ్మాయికి అమెరికాలో అమెజాన్‌ కేంద్ర కార్యాలయంలో కొలువు.. ఏడాదికి రూ. 1.7 కోట్ల ప్యాకేజీ

Kadapa Girl Got Job In Amazon Central Office In USA
కడప అమ్మాయి ఎర్రనాగుల అమృతవల్లి జాక్‌పాట్ కొట్టింది. వాషింగ్టన్‌లోని సియాటెల్‌లో ఉన్న అమెజాన్ కేంద్ర కార్యాలయంలో సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ ఇంజినీర్‌గా ఏడాదికి రూ. 1.7 కోట్ల ప్యాకేజీతో ఉద్యోగం సంపాదించింది. 

విజయవాడలోని ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్ పూర్తిచేసిన అమృతవల్లి జేఈఈలో మంచి ర్యాంకు సాధించి దుర్గాపూర్ ఎన్ఐటీలో కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ పూర్తి చేసింది. అనంతరం అమెరికాలోని ఫ్లోరిడా యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్ బ్రాంచ్‌లో ఎంఎస్ చేసింది. అది పూర్తిచేసిన నెల రోజులకే అమెజాన్‌లో ఉద్యోగం రావడం గమనార్హం.
Kadapa
Amazon
Software Engineer
Amrutavalli
Andhra Pradesh

More Telugu News