saripodhaa sanivaaram: నాని సినిమా ‘సరిపోదా శనివారం’ కలెక్షన్లు ఎలా ఉన్నాయంటే..?

saripodhaa sanivaaram crossed the 50 crore mark
  • కలెక్షన్లలో దసరా, హాయ్ నాన్న మూవీల జాబితాలో సరిపోదా శనివారం
  • మూడు రోజుల్లో 50కోట్ల కలెక్షన్లు రాబట్టిందని అంటున్న సరిపోదా శనివారం మూవీ యూనిట్ 
  • హీరో నాని 50 కోట్ల గ్రాస్ హ్యాట్రిక్ కొట్టాడని అంటున్న నిర్మాణ యూనిట్
నాని హీరోగా వివేక్ ఆత్రేయ దర్శక్వంలో డీవీవీ ఎంటర్ టైన్మెంట్ బ్యానర్ పై డీవీవీ దానయ్య, ఆయన కుమారుడు దాసరి కల్యాణ్ నిర్మించిన సరిపోదా శనివారం సినిమా గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా మొదటి షో నుండే పాజిటివ్ టాక్ వచ్చేసింది. సినిమా లైన్ మొత్తం ముందే చెప్పేసి థియేటర్ లకు రప్పించిన సినిమా యూనిట్ ను ప్రేక్షకులు అభినందిస్తున్నారు. 

ఈ సినిమా కలెక్షన్లు చూసి చిత్ర యూనిట్ సంతోషాన్ని సంతోషాన్ని వ్యక్తం చేస్తోంది. మూడు రోజుల వసూళ్లతో కలిపి ఈ మూవీ రూ.50 కోట్ల కలెక్షన్ దాటేసిందని మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఓ పక్క జోరుగా వర్షాలు కురుస్తున్నా సినిమా చూసేందుకు ప్రేక్షకులు థియేటర్ లకు తరలివస్తున్నారని సినిమా యూనిట్ పేర్కొంది.

ఈ నేపథ్యంలో ఈ మూవీ అఖండ విజయం సాధిస్తుందని నిర్మాణ యూనిట్ ఆశాభావం వ్యక్తం చేస్తొంది. ఈ క్రమంలో నానికి హ్యాట్రిక్ 50 కోట్ల గ్రాసర్ గా నిలిచిందని అంటున్నారు. దసరా, హాయ్ నాన్న మూవీలు కూడా రూ.50కోట్లపైగానే కలెక్షన్లు రాబట్టాయి. దీంతో ఇప్పుడు ఈ మూవీ కూడా ఆ జాబితాలో చేరడంతో నాని 50 కోట్ల గ్రాస్ హ్యాట్రిక్ కొట్టాడని టాక్ నడుస్తోంది.
saripodhaa sanivaaram
Movie News
hero Nani

More Telugu News