Junior NTR: మా అమ్మ చిరకాల స్వప్నం ఇదే... నెరవేరింది: జూనియర్ ఎన్టీఆర్

My mother forever dream of going to home town fulfilled today tweets Jr NTR
  • సొంతూరుకి తీసుకువెళ్లి ఉడుపి శ్రీకృష్ణుడ్ని దర్శనం చేయించాలనేది అమ్మ చిరకాల స్వప్నమన్న తారక్
  • తల్లి కోరిక నెరవేర్చినఎన్టీఆర్
  • తారక్ తో పాటు ప్రశాంత్ నీల్, రిషబ్ శెట్టి
తన సొంతూరు కర్ణాటకలోని కుందపురకు నన్ను తీసుకువచ్చి, ఉడుపి శ్రీకృష్ణుడి దర్శనం చేయించాలనేది తన తల్లి చిరకాల స్వప్నం అని, అది ఇవాళ నెరవేరిందని టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ తెలిపారు. సెప్టెంబర్ 2 తన తల్లి పుట్టినరోజని... జన్మదినానికి ముందు ఆమె కోరిక నెరవేరడం తనకు ఎంతో సంతోషంగా ఉందని చెప్పారు. ఇంతకంటే గొప్ప బహుమతిని ఆమెకు తాను ఇవ్వలేనని చెప్పారు. 

ఈ కల నెరవేరేందుకు తనతో పాటు ఉన్న దర్శకుడు ప్రశాంత్ నీల్, సినీ నిర్మాత, హొంబలే గ్రూప్ వ్యవస్థాపకుడు విజయ్ కిరగండూర్ కి ధన్యవాదాలు తెలుపుతున్నానని తారక్ చెప్పారు. తన ఆప్త మిత్రుడు రిషబ్ శెట్టి (కాంతార ఫేమ్) తమతో ఉండటం ఈ సంతోష సమయాన్ని మరింత ప్రత్యేకంగా మార్చిందని అన్నారు. తన తల్లి, రిషబ్ శెట్టి, ప్రశాంత్ నీల్ లతో కలిసి దిగిన ఫొటోలను ఎక్స్ వేదికగా షేర్ చేశారు.
Junior NTR
Tollywood
Mother
Native Town
Prashanth Neel
Rishab Shetty
Udupi

More Telugu News