పార్క్ చేసిన కారును ఢీకొని పల్టీ కొట్టిన కారు.. హైదరాబాద్ లో ఘోర ప్రమాదం
- డ్రైవర్ సీరియస్.. మరో నలుగురికి గాయాలు
- తుక్కుతుక్కుగా మారిన కారు, ఆటో
- బంజారాహిల్స్ రోడ్ నెం.2 లో కారు బీభత్సం
శంషాబాద్ నుంచి ఓ కుటుంబం చిలకలగూడ వెళుతుండగా బంజారాహిల్స్ లో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో డ్రైవర్ కు తీవ్రగాయాలు కాగా భార్య, భర్త ఇద్దరు పిల్లలకు స్వల్ప గాయాలయ్యాయి. స్థానికులు వారిని వెంటనే దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. డ్రైవర్ నిద్రమత్తు వల్ల ఈ ప్రమాదం జరిగిందా? లేక ఆ సమయంలో డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నాడా? అనే కోణంలో విచారణ జరుపుతున్నారు.