Salman Khan: మరోసారి వార్తల్లోకెక్కిన సల్మాన్ ఖాన్ బాడీగార్డు

bollywood actor salman khans bodyguard shera who bought a car worth Rs1 4 crores
  • రూ.1.4 కోట్ల విలువైన లగ్జరీ రేంజ్ రోవర్ కారును కొనుగోలు చేసిన సల్మాన్ ఖాన్ బాడీ గార్డు షేరా
  • కారు ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసిన షేరా
  • షేరా నెల వేతనం రూ.15 లక్షల వరకూ ఉంటుందని మీడియా కథనాలు
బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ వ్యక్తిగత సంరక్షకుడు (బాడీగార్డు) షేరా మరో సారి వార్తల్లోకి ఎక్కారు. షేరా రూ.1.4 కోట్ల విలువైన లగ్జరీ రేంజ్ రోవర్ కారను కొనుగోలు చేశాడు. ఆ కారు ఫోటోను షేరా తన ఇన్‌స్టాగ్రామ్ లో షేర్ చేశారు. సర్వశక్తిమంతుడి ఆశీర్వాదంతో మేము కొత్త సభ్యుడిని మా ఇంటికి స్వాగతిస్తున్నామని షేరా పేర్కొన్నారు. 

దీంతో ఇది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. షేరా నమ్మకస్తుడైన బాడీ గార్డుగా సల్మాన్ ఖాన్ కు 29 సంవత్సరాలుగా పని చేస్తున్నాడు. కాగా, 1.4కోట్ల విలువైన కారు కొనుగోలు చేయడంతో షేర్ నెల జీతం ఎంత అనేది చర్చనీయాంశం అయ్యింది. అయితే కొన్ని మీడియా కథనాల ప్రకారం, షేరా జీతం నెలకు రూ.15 లక్షలు వరకూ ఉంటుందని అంచనా. 
Salman Khan
bollywood actor
bodyguard shera

More Telugu News