Gudlavalleru Engineering College: గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజి వద్ద విద్యార్థి సంఘాల ఆందోళన

Girl students held agitation at Gudlavalleru Engineering College
  • విద్యార్థినుల వాష్ రూమ్ లో సీక్రెట్ కెమెరా
  • తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న విద్యార్థి సంఘాలు
  • న్యాయం చేయాలంటూ గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజి వద్ద విద్యార్థినుల నినాదాలు
ఉమ్మడి కృష్ణా జిల్లా గుడ్లవల్లేరులోని ఓ ఇంజనీరింగ్ కాలేజీలో అమ్మాయిల హాస్టల్ వాష్ రూమ్ లో సీక్రెట్ కెమెరా బయటపడడం తీవ్ర కలకలం రేపుతోంది. ఈ హిడెన్ కెమెరా ద్వారా చిత్రీకరించిన ఇంజనీరింగ్ విద్యార్థినుల వీడియోలు బహిర్గతం అయ్యుంటాయని సర్వత్రా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. నిందితులను కఠినంగా శిక్షించాలంటూ డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. 

ఈ నేపథ్యంలో, గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజి వద్ద విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో విద్యార్థినులు ఆందోళనకు దిగారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలి... న్యాయం జరగాలి... అంటూ విద్యార్థినులు నినాదాలు చేశారు. వర్షం పడుతున్నప్పటికీ వారు ఆందోళన కొనసాగించారు. 

ఓ దశలో విద్యార్థి సంఘాల నేతలు హాస్టల్ లోకి వెళ్లేందుకు ప్రయత్నించగా, పోలీసులు వారిని అడ్డుకున్నారు. దాంతో ఇరువర్గాల మధ్య వాగ్యుద్ధం జరగ్గా, కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది.
Gudlavalleru Engineering College
Hidden Camera
Wash Room
Students
Krishna District

More Telugu News