Kova Lakshmi: బీఆర్ఎస్ ఎమ్మెల్యే కోవ లక్ష్మికి తీవ్ర అస్వస్థత

BRS MLA Kova Lakshmi shifted to Hyderabad for better medical treatment
  • మూడు రోజులుగా తీవ్ర జ్వరంతో బాధపడుతున్న కోవ లక్ష్మి
  • నిన్న భారీగా పెరిగిపోయిన బీపీ, షుగర్ లెవల్స్ 
  • మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ కు తరలింపు
బీఆర్ఎస్ ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. గత మూడు రోజులుగా ఆమె తీవ్ర జ్వరంతో బాధపడుతున్నారు. అయినప్పటికీ ఇంటి వద్దే ఉంటూ ఆమె చికిత్స పొందుతున్నారు. నిన్న ఒక్కసారిగా ఆమెకు బీపీ, షుగర్ లెవల్స్ పెరిగిపోయాయి. దీంతో, హుటాహుటిన జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి ఆమెను తరలించారు. అక్కడ ఆమెకు చికిత్స అందించిన వైద్యులు మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ కు తీసుకెళ్లాలని సూచించారు. అక్కడి డాక్టర్ల సూచన మేరకు కోవ లక్ష్మిని హైదరాబాద్ కు తీసుకొచ్చారు. నగరంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఆమెకు చికిత్స అందిస్తున్నారు. విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ అభిమానులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఆసుపత్రి వద్దకు వస్తున్నారు. ఆమె ఆరోగ్య పరిస్థితి గురించి ఆసుపత్రి సిబ్బందిని అడిగి తెలుసుకుంటున్నారు.
Kova Lakshmi
BRS

More Telugu News