Kolkata Horror: కోల్‌కతా ఘోర ఘటన: ఆసుపత్రి సిబ్బంది.. బాధిత వైద్యురాలి తల్లిదండ్రుల మధ్య జరిగిన ఫోన్‌కాల్ ఆడియో క్లిప్ వెలుగులోకి!

Kolkata Horror What did hospital tell parents on August 9 Audio Clips Viral
  • ఘటన జరిగిన రోజున వరుసగా మూడుసార్లు బాధిత వైద్యురాలి తల్లిదండ్రులకు ఫోన్
  • ఒకసారి ఒంట్లో బాగా లేదని, మరోసారి సీరియస్‌గా ఉందని, ఇంకోసారి ఆత్మహత్య చేసుకుందని చెప్పిన సూపరింటెండెంట్ సుచిత్ర
  • తెల్లవారుజామున 3 నుంచి 5 గంటల మధ్య వైద్యురాలు చనిపోయినట్టు పోస్టుమార్టం రిపోర్టు
  • తొలి కాల్ చేసింది మాత్రం ఉదయం రూ. 10.53 గంటలకు
  • ఘటన జరిగిన తర్వాతి నుంచి ఇప్పటి వరకు మీడియా ముందుకు రాని సుచిత్ర
కోల్‌కతా వైద్యురాలిపై అత్యాచారం, హత్య కేసులో ఇప్పుడు వేళ్లన్నీ ఆర్‌జీ కర్ ఆసుపత్రి వైపే చూపిస్తున్నాయి. తాజాగా వెలుగులోకి వచ్చిన ఆడియో క్లిప్ ఒకటి అనుమానాలను మరింత బలపరుస్తోంది. వైద్యురాలు హత్యకు గురైన తర్వాత ఈ నెల 9న బాధిత వైద్యురాలి తల్లిదండ్రులకు ఆసుపత్రి సిబ్బంది ఫోన్ చేశారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ ఆడియో క్లిప్‌లోని వివరాలు బాధిత తల్లిదండ్రులు తొలుత మీడియాకు చెప్పిన వివరాలతో సరిపోలుతున్నాయి. ఓ మహిళ తమకు ఫోన్ చేసి కుమార్తె విషయం చెప్పినట్టు వారు పేర్కొన్నారు.

ఆసుపత్రిలోని చాతీ విభాగంలోని వైద్యురాలు హత్యాచారానికి గురైంది. అప్పుడా విభాగానికి అరుణవ దత్తా చౌదరి ఇన్‌చార్జ్‌గా ఉన్నారు. ఈ నెల 14న మీడియాతో మాట్లాడుతూ బాధిత వైద్యురాలి తల్లిదండ్రులకు నాన్ మెడికల్ అసిస్టెంట్ సూపరింటెండెంట్ సుచిత్ర సర్కార్ ఫోన్ కాల్స్ చేసినట్టు తెలిపారు. సీబీఐ ఆమెను ప్రశ్నించింది. అయితే, ఘటన జరిగిన తర్వాతి నుంచి ఇప్పటి వరకు ఆమె మీడియా ముందుకు రాలేదు.

ఆ కాల్‌లో ఆ మహిళ (సుచిత్ర) వైద్యురాలి తండ్రితో మాట్లాడుతూ.. ‘‘మీ అమ్మాయి తీవ్ర అస్వస్థతతో బాధపడుతోంది. ఆసుపత్రిలో చేర్చాం. త్వరగా రండి’’ అని పేర్కొన్నారు. ఏమైందని ఆయన అడిగితే ‘‘ఆమెకు బాగాలేదు. ఆమెకు ఏమైందన్నది వైద్యులు మాత్రమే చెప్పగలరు. మీ నంబరు తెలుసుకుని ఫోన్ చేశాం’’ అని చెప్పారు. 

మరో ఆడియో క్లిప్‌లో ఆమె మాట్లాడుతూ.. ‘‘ఆమెకు సీరియస్‌గా ఉంది. ఎమర్జెన్సీ వార్డులో జాయిన్ చేశాం. ఏమైందో నేను చెప్పలేను. వైద్యులు మాత్రమే చెప్పగలరు.. త్వరగా రండి’’ అని పేర్కొన్నారు.  ‘ఇంతకీ మీరెవరు?’ అని అడిగితే ‘నేను అసిస్టెంట్ సూపరింటెండెంట్‌ను. నేను డాక్టర్‌ను కాదు. 

మూడోసారి ఫోన్ చేస్తూ.. ‘‘ఆమె ఆత్మహత్య చేసుకుంది. చనిపోయినట్టుగా ఉంది. పోలీసులు వచ్చారు. మేమంతా ఇక్కడే ఉన్నాం. వీలైనంత త్వరగా రండి’’ అని పేర్కొన్నారు. ఆయన తన ఫోన్ స్పీకర్‌ను ఆన్ చేయడంతో ఆ విషయాన్ని బాధితురాలి తల్లి కూడా ఉంది. 

పోస్టుమార్టం రిపోర్టులో మాత్రం ఆమె తెల్లవారుజామున 3 నుంచి 5 మధ్య చనిపోయినట్టు నిర్ధారణ అయింది. ఆసుపత్రి వైద్యులు మాత్రం మృతదేహాన్ని 9 గంటలకు సెమినార్ హాల్‌లో చూసినట్టు చెప్పారు. ఆసుపత్రి నుంచి 10.53 గంటలకు తొలి ఫోన్ కాల్ వచ్చినట్టు చెప్పారు. ఆ తర్వాత రెండు కాల్స్ వచ్చినట్టు తెలిపారు.
Kolkata Horror
RG Kar Medical College
Kolkata
Viral Audio Clips

More Telugu News