Priyanka Chopra: కుమార్తె మాల్టీ మేరీ పేరుతో ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను ఓపెన్ చేసిన ప్రియాంక చోప్రా

Actress priyanka chopra created her daughters instagram account
  • ముంబైలో ఇటీవల జరిగిన సోదరుడి నిశ్చితార్ధ వేడుకకు హజరైన ప్రియాంక చోప్రా
  • తన కుమార్తె మాల్టీ మేరీ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను ప్రారంభించిన నటి ప్రియాంక
  • తన ఇన్‌స్టాలో కుమార్తె ఫొటోను పంచుకున్న వైనం  
బాలీవుడ్ నటి, హీరోయిన్ ప్రియాంక చోప్రా, ఆమె భర్త నిక్ జోనాస్ చాలా కాలంగా తమ కుమార్తెకు సంబంధించిన ఎలాంటి ఫొటోలు బయటకు రానివ్వకుండా జాగ్రత్త పడ్డారు. ఇటీవలి కాలం వరకూ సోషల్ మీడియాలో చిన్నారి ముఖాన్ని కూడా చూపించలేదు. అయితే అనూహ్యంగా నటి ప్రియాంక బుధవారం తన కుమార్తె మాల్టీ మేరీ పేరుతో ప్రత్యేకంగా ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను ఓపెన్ చేయడంతో పాటు తన ఇన్‌స్టా స్టోరీలో ఆమె ఫొటోను పంచుకున్నారు. తన కుమార్తె యొక్క అధికారిక ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ ను పేర్కొంది.  

ప్రియాంక ఇటీవల ముంబైలో జరిగిన తన సోదరుడు సిద్ధార్థ్ చోప్రా నిశ్చితార్ధ వేడుకకు హజరై సందడి చేసింది. ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను కూడా షేర్ చేసింది. ఆమె సోదరుడు సిద్ధార్థ్ చోప్రాకు ఆగస్టు 23న ముంబైలో తన తోటి నటి నీలం ఉపాధ్యాయ్‌తో నిశ్చితార్ధం జరిగింది. ఈ వేడుకలో నటి ప్రియాంక అద్భుతమైన చీరను ధరించి అందరినీ ఆకట్టుకుంది. ఆ తర్వాత ఇండియా పర్యటన ముగించుకుని అమెరికా వెళ్లింది. తాజాగా ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో తన కుమార్తె ఫొటోను షేర్ చేయడం హాట్ టాపిక్ అయింది. 
 
కాగా, ప్రియాంక చోప్రా ప్రస్తుతం పానీ ఆనే మరాఠీ మూవీకి నిర్మాతగా వ్యవహరిస్తోంది. అంతే కాకుండా త్వరలో తన స్పై – థ్రిల్లర్ స్ట్రీమింగ్ షో సిటాడెల్ రెండో భాగంలో ప్రియాంక కనిపించనుంది. గ్లోబల్ సిరీస్ యొక్క రెండవ సీజన్ ఈ ఏడాది ప్రారంభం కానుంది. దీనికి జో రస్పో దర్శకత్వం వహించనున్నారు. మాసన్‌కేన్ పాత్రలో రిచర్డ్ మాడెన్‌తో పాటు ప్రియాంక చోప్రా జోనాస్ తన నాడియా పాత్రలో తిరిగి రానుంది.  
Priyanka Chopra
instagram account
Movie News

More Telugu News