HYDRA: ఆ ఆరుగురు అధికారులపై చర్యలు... హైడ్రా కీలక నిర్ణయం

Hydra ready to file case against officials
  • అక్రమ నిర్మాణాలకు అనుమతులు ఇచ్చిన అధికారులపై చర్యలకు హైడ్రా సిద్ధం
  • ఆరుగురు అధికారులపై క్రిమినల్ కేసులు పెట్టాలని నిర్ణయం
  • కేసులు పెట్టాలని సైబరాబాద్ కమిషనర్‌కు సిఫార్సు
హైడ్రా కీలక నిర్ణయం తీసుకుంది. చెరువుల పరిధిలోని ఎఫ్‌టీఎల్‌లో నిర్మాణాలకు అనుమతులు ఇచ్చిన అధికారులపై చర్యలకు సిద్ధమైంది. అలాంటి అధికారులపై క్రిమినల్ కేసులు పెట్టాలని నిర్ణయించింది. ఈ మేరకు ఆరుగురు అధికారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని సైబరాబాద్ కమిషనర్‌కు హైడ్రా సిఫార్సు చేసింది.

హెచ్ఎండీఏ పరిధిలో అక్రమంగా అనుమతులు ఇచ్చిన అధికారుల జాబితాను హైడ్రా సిద్ధం చేసింది. ప్రస్తుతానికి ఆరుగురు అధికారులపై చర్యలు తీసుకోవాలని నిర్ణయించుకున్నప్పటికీ అక్రమ నిర్మాణాలకు సంబంధించి జాబితా పెరగవచ్చునని భావిస్తున్నారు.
HYDRA
Hyderabad
Congress

More Telugu News