Mamata Banerjee: అభినంద‌న‌లు హోంమంత్రి గారూ.. జై షా ప‌దవిపై దీదీ సెటైరిక‌ల్ ట్వీట్‌!

Mamata Banerjee Saterical Tweet on Jay Shah ICC Chairman Post
కేంద్ర హోంమంత్రి అమిత్ షా కుమారుడు జై షా ఇటీవ‌ల‌ ఐసీసీ ఛైర్మ‌న్‌గా ఎంపికైన విష‌యం తెలిసిందే. అయితే, జై షా ప‌ద‌విపై ప‌శ్చిమ బెంగాల్ ముఖ్య‌మంత్రి మ‌మ‌తా బెన‌ర్జీ 'ఎక్స్' (ట్విట్ట‌ర్‌) వేదిక‌గా సెటైర్ వేశారు. 

"కేంద్ర హోంమంత్రికి అభినంద‌న‌లు. మీ కుమారుడు రాజ‌కీయ నాయ‌కుడు కాలేక‌పోయాడు. కానీ ఐసీసీ ఛైర్మ‌న్ అయ్యాడు. అనేక మంది నాయ‌కుల కంటే అది చాలా ముఖ్య‌మైన ప‌ద‌వి. మీ కుమారుడు నిజంగా చాలా శ‌క్తిమంతుడిగా మారాడు. అతను ఈ అత్యంత ఉన్నతమైన విజ‌యం సాధించినందుకు నేను మిమ్మ‌ల్ని అభినంద‌స్తున్నాను! వందనాలు!!" అని దీదీ ట్వీట్ చేశారు.
Mamata Banerjee
Amit Shah
Jay Shah
ICC Chairman

More Telugu News