Actor Darshan: కన్నడ స్టార్ హీరో దర్శన్ ను బళ్లారి జైలుకు తరలించిన అధికారులు

Actor Darshan shifted to Bellary jail
  • పరప్పన అగ్రహార జైల్లో ఉన్న దర్శన్
  • జైల్లో సిగరెట్ కాల్చుతున్న ఫోటోలు వైరల్
  • దర్శన్ రాజభోగాలు అనుభవిస్తున్నాడంటూ తీవ్ర విమర్శలు
కన్నడ స్టార్ హీరో దర్శన్ తూగుదీపను బళ్లారి సెంట్రల్ జైలుకు అధికారులు తరలించారు. బెంగళూరులోని పరప్పన అగ్రహార జైల్లో సిగరెట్ కాల్చుతూ, టీ తాగుతున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. జైల్లో ఆయన వీడియో కాల్ మాట్లాడుతున్న ఓ వీడియో కూడా వైరల్ అయింది. దీంతో, జైల్లో దర్శన్ రాజభోగాలు అనుభవిస్తున్నాడంటూ పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. జైల్లో ఆయనకు రాచమర్యాదలు అందుతున్నాయని సోషల్ మీడియా కోడై కూసింది. ఈ క్రమంలో జైలు సూపరింటెండెంట్ తో పాటు మరో తొమ్మిది మంది సిబ్బందిని ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. 

తాజాగా ఏసీపీ తంగప్ప ఆధ్వర్యంలో భారీ బందోబస్తు మధ్య దర్శన్ ను బళ్లారి జైలుకు తరలించారు. జైల్లో దర్శన్ తో పాటు ఉన్న ఆయన సహచరులను కూడా వివిధ జైళ్లకు తరలించారు. మరోవైపు జైల్లో దర్శన్ రాజభోగాలపై మూడు కేసులు నమోదు చేసినట్టు పోలీస్ కమిషనర్ దయానంద తెలిపారు. తన అభిమాని రేణుకస్వామి మర్డర్ కేసులో దర్శన్ విచారణ ఖైదీగా ఉన్న సంగతి తెలిసిందే.
Actor Darshan
Bellary
Jail

More Telugu News