Woman Murder: హైదరాబాద్ లో ఘోరం.. ప్రేమోన్మాది చేతిలో బలైన యువతి

woman was brutally stabbed to death allegedly by her boyfriend
  • పెళ్లికి ఒప్పుకోలేదని యువతిపై కత్తితో దాడి
  • అడ్డొచ్చిన స్నేహితురాళ్లకూ కత్తిపోట్లు
  • ఆపై ఆత్మహత్యకు ప్రయత్నించిన యువకుడు
హైదరాబాద్ లోని గచ్చిబౌలిలో బుధవారం రాత్రి దారుణం చోటుచేసుకుంది. ఏడాదిగా వెంటపడుతున్నా పెళ్లికి ఒప్పుకోలేదనే కోపంతో ఓ యువకుడు విచక్షణ కోల్పోయాడు. స్నేహితురాలిపై కత్తితో దాడి చేసి చంపేశాడు. అడ్డొచ్చిన ఆమె స్నేహితురాళ్లపైనా దాడి చేశాడు. ఆపై అక్కడి నుంచి వెళ్లి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాఫ్తు చేస్తున్నారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పశ్చిమ బెంగాల్ కు చెందిన దీపన తమాంగ్ నల్లగండ్లలో బ్యుటీషియన్ గా పనిచేస్తోంది. గోపన్ పల్లి తండా సమీపంలో స్నేహితురాళ్లతో కలిసి ఉంటోంది. దీపనకు కర్ణాటకకు చెందిన రాకేశ్ తో కొంతకాలంగా పరిచయం ఉంది. ఈ క్రమంలోనే పెళ్లి చేసుకుందామంటూ రాకేశ్ ఒత్తిడి చేస్తుండగా దీపన నిరాకరిస్తూ వస్తోంది. దాదాపు ఏడాదిగా వెంటపడుతున్న రాకేశ్.. బుధవారం రాత్రి ఉన్మాదిగా మారాడు. యువతి ఉంటున్న ఇంటికి వెళ్లి ఆమెపై కత్తితో దాడి చేశాడు. తీవ్ర గాయాలతో దీపన అక్కడికక్కడే చనిపోయింది. దీపనను కాపాడేందుకు ప్రయత్నించిన ఆమె స్నేహితురాళ్లకూ గాయాలయ్యాయి. తర్వాత అక్కడి నుంచి మెయినాబాద్ సమీపంలోని కనకమామిడి వద్ద ఓ విద్యుత్ స్తంభం ఎక్కి రాకేశ్ ఆత్మహత్యకు ప్రయత్నించాడు. కరెంట్ షాక్ తో కిందపడ్డ రాకేశ్ ను స్థానికులు ఆసుపత్రికి తరలించారు.
Woman Murder
Stabbed
Boyfriend
Gopanpally Thanda
Hyderabad

More Telugu News