Paralympics 2024: ఆరంభమైన పారాలింపిక్స్ 2024

French President Emmanuel Macron declared that Paralympics 2024 Officially Open
  • ప్రారంభమైనట్టు ప్రకటించిన ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయేల్ మాక్రాన్
  • ఆకట్టుకునే ప్రదర్శనలతో విశ్వక్రీడా సంరంభం షురూ
  • భారత బృందానికి నాయకత్వం వహించిన సుమిత్ అంటిల్, భాగ్యశ్రీ జాదవ్ 
పారాలింపిక్స్-2024 విశ్వక్రీడల సంరంభం ప్రారంభమైంది. పారిస్ నగరంలో అంగరంగ వైభవంగా జరిగిన వేడుకలతో మొదలయ్యాయి. ఈ మేరకు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ పారాలింపిక్స్‌-2024ను ప్రారంభించినట్లు గురువారం ప్రకటించారు. ఫ్రాన్స్ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా ఆరంభ వేడుకలను నిర్వహించారు. పలు ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. కాగా ప్రారంభ కార్యక్రమంలో 167 దేశాలకు చెందిన మొత్తం 4,400 మంది పారాలింపియన్లు పాల్గొన్నారు. చాంప్స్-ఎలీసీస్ నుంచి ప్లేస్ డీ లా కాంకోర్డ్ మైదానం వరకు కవాతు చేశారు. 

భారత్ బృందానికి పారా-అథ్లెట్‌లు సుమిత్ యాంటిల్, భాగ్యశ్రీ జాదవ్ నాయకత్వం వహించారు. 12 విభిన్న క్రీడలలో 84 మంది అథ్లెట్లు ఈసారి భారత్ తరపున ప్రాతినిధ్యం వహించనున్నారు. ఒలింపిక్స్‌లో ఇంతపెద్ద సంఖ్యలో భారత పారా అథ్లెట్లు పాల్గొనడం చరిత్రలో ఇదే తొలిసారి. కాగా తొలి రోజున భారత అథ్లెట్లు పలు విభాగాల్లో తలపడనున్నారు.
Paralympics 2024
Emmanuel Macron
Sumit Antil
Bhagyashri Jadhav
Sports News

More Telugu News