OYO Rooms: ఓయో రూమ్ లో హిడెన్ కెమెరా.. హైదరాబాద్ లో యజమాని నిర్వాకం

Hiden Cameras In OYO Room And Owner Blackmailed Customers in Hyderabad
  • కస్టమర్లను బ్లాక్ మెయిల్ చేస్తూ డబ్బు గుంజుతున్న వైనం
  • ఓ జంట ఫిర్యాదుతో వెలుగులోకి వచ్చిన దారుణం
  • చాలాకాలంగా బెదిరింపులకు గురిచేస్తున్నట్లు వెల్లడి
ఓయో రూమ్ లో హిడెన్ కెమెరా పెట్టి కస్టమర్లను బ్లాక్ మెయిల్ చేస్తున్న ఓ యజమాని నిర్వాకం తాజాగా బట్టబయలైంది. హైదరాబాద్ లో ఓ జంట ఫిర్యాదు చేయడంతో పోలీసులు సదరు యజమానిని అరెస్టు చేశారు. విచారణలో ఈ తంతు చాలాకాలంగా చేస్తున్నానని, చాలామందిని ఇలాగే బ్లాక్ మెయిల్ చేశానని ఒప్పుకున్నాడు. 

పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. శంషాబాద్ లోని సితా గ్రాండ్ హోటల్ లో ఈ దారుణం చోటుచేసుకుంది. హోటల్ నిర్వాహకుడు ఓయోతో ఒప్పందం కుదుర్చుకుని జంటలకు గదులు అద్దెకు ఇస్తున్నాడు. ఈ క్రమంలోనే తన హోటల్ లోని గదులలో రహస్యంగా కెమెరాలు ఏర్పాటు చేశాడు. ఆ గదిలో దిగిన వారు సన్నిహితంగా గడిపినదంతా ఆ కెమెరాల ద్వారా రికార్డు చేశాడు. ఆపై ఆ వీడియోలు చూపిస్తూ జంటలను బెదిరించేవాడు. ఎంతోకొంత డబ్బు ఇస్తే వీడియోను డిలీట్ చేస్తానని, లేదంటే సోషల్ మీడియాలో అప్ లోడ్ చేస్తానని చెప్పి డబ్బు గుంజేవాడు.

ఈ బెదిరింపులతో భయాందోళనలకు గురైన చాలామంది కస్టమర్లు డబ్బులు చెల్లించారు. తాజాగా ఓ యువ జంటను కూడా ఇలాగే బెదిరించే ప్రయత్నం చేయగా.. వారు ఎదురుతిరిగి పోలీసులను ఆశ్రయించారు. వారి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు.. సితా గ్రాండ్ హోటల్ లో సోదాలు చేపట్టి హిడెన్ కెమెరాలను గుర్తించారు. దీంతో నిందితుడిని అరెస్టు చేసి రెండు ఫోన్లు, సీసీ కెమెరాలు స్వాధీనం చేసుకున్నారు.
OYO Rooms
Hyderabad
Hiden Cameras
BlackMail

More Telugu News