Actor Vijay: అందరూ ఎంజీఆర్‌లు అయిపోరు.. నటుడు విజయ్ పొలిటికల్ ఎంట్రీపై డీఎంకే నేత విసుర్లు

Not everyone can become like MGR Says DMK leader RS Bharathi
  • రాజకీయ పార్టీని ఎవరు ప్రారంభించినా తమకు ఇబ్బంది లేదన్న ఆర్ఎస్ భారతి
  • ఇలాంటి వారు ఒకటి రెండు నెలలు మాత్రమే ఉండి కనుమరుగైపోతారన్న నేత
  • ఎంజీఆర్ కూడా తొలుత డీఎంకేలో చేరి ఆ తర్వాత చీల్చి అన్నాడీఎంకే పెట్టారని గుర్తు చేసిన భారతి
  • వచ్చే ఎన్నికల్లో తన పార్టీ పోటీ చేస్తుందని ఇటీవల ప్రకటించిన విజయ్
కోలీవుడ్ స్టార్ నటుడు విజయ్ పొలిటికల్ ఎంట్రీపై డీఎంకే ఆర్గనైజేషనల్ సెక్రటరీ ఆర్ఎస్ భారతి సెటైర్ వేశారు. రాజకీయాల్లోకి వచ్చినంత మాత్రాన ప్రతి ఒక్కరు మాజీ ముఖ్యమంత్రి ఎంజీ రామచంద్రన్‌ కాలేరని పరోక్షంగా విజయ్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. నాగపట్టణంలో  నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. రాజకీయ పార్టీని ఎవరు ప్రారంభించినా తమకేమీ ఇబ్బంది లేదని పేర్కొన్నారు. వారు ఒకటి రెండు నెలలు ఉండొచ్చని, అంతకుమించి నిలవలేరని తేల్చి చెప్పారు. సొంత పార్టీ పెట్టిన వారందరూ ఎంజీ రామచంద్రన్ కాలేరని ఎద్దేవా చేశారు. ఎంజీఆర్ కూడా తొలుత పార్టీ పెట్టలేదని, మొదట ఆయన డీఎంకేలో చేరి, ఆ తర్వాతే అన్నాడీఎంకే పార్టీ పెట్టారని తెలిపారు.

‘‘ఆయన (ఎంజీఆర్) డీఎంకేను చీల్చి, కొందరు నాయకులను తనతో తీసుకెళ్లారు. ఇది చూసి చాలామంది సొంత పార్టీలు పెట్టి తెల్లారే అసెంబ్లీలోకి ప్రవేశించాలని కలలు కంటున్నారు’’ అని పేర్కొన్నారు. అసెంబ్లీకి వచ్చినంత వేగంగా ఆ నేతలు మళ్లీ వెనక్కి వస్తున్నారని, ఆ పార్టీలు ఖాళీ పాత్రల్లాంటి వారని యువత అనుకోవడమే అందుకు కారణమని వివరించారు. డీఎంకే 75 ఏళ్లుగా పనిచేస్తోంది. ఈ కాలంలో ఎన్నో తుపానులు, సునామీలను ఎదుర్కొంది" అని ఆర్ఎస్ భారతి చెప్పుకొచ్చారు.

డీఎంకేను విడిచిపెట్టిన ఎంజీఆర్ 1972లో అన్నాడీఎంకేను స్థాపించారు. ఆ తర్వాత ఆయన వరుసగా మూడుసార్లు తమిళనాడు ముఖ్యమంత్రిగా పనిచేశారు. కాగా, విజయ్ ఈ ఏడాది ఫిబ్రవరిలో పార్టీని ప్రారంభించాడు. తన పార్టీ ‘తమిళిగ వెట్రి కళగమ్ (టీవీకే) వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేస్తుందని విజయ ఇటీవలే ప్రకటించాడు. పార్టీ జెండాను కూడా ఇటీవల ఆవిష్కరించాడు.
Actor Vijay
RS Bharathi
Tamil Nadu
MG Ramachandran
Tamilaga Vettri Kazhagam
DMK
AIADMK

More Telugu News