Megastar Chiranjeevi: వీరాభిమాని ఈశ్వ‌రయ్య కుటుంబాన్ని స‌త్క‌రించిన మెగాస్టార్ చిరంజీవి... ఫొటోలు ఇవిగో!

Megastar Chiranjeevi felicitates his hard core fan Eashwaraiah and his family members
  • ఆగస్టు 22న చిరంజీవి పుట్టినరోజు
  • పొర్లుదండాలు పెడుతూ తిరుమల కొండెక్కిన చిరంజీవి వీరాభిమాని ఈశ్వరయ్య
  • విషయం తెలిసి ముగ్ధుడైన మెగాస్టార్
  • ఈశ్వరయ్యను తన ఇంటికి పిలిపించుకున్న వైనం
ఆగ‌స్ట్ 22న మెగాస్టార్ చిరంజీవి పుట్టిన‌రోజు. ఈ సంద‌ర్భంగా ఈశ్వ‌ర‌య్య అనే వీరాభిమాని మెట్ల మార్గంలో పొర్లుదండాలు పెట్టుకుంటూ తిరుమల కొండ ఎక్కి తన అభిమానాన్ని చాటుకున్న సంగ‌తి అందరికీ తెలిసిందే. చిరంజీవి, ఆయన కుటుంబ సభ్యులు ఆయురారోగ్యాలతో క్షేమంగా ఉండాలంటూ తిరుమల వెంకన్నను ప్రార్థించారు.

ఈశ్వ‌ర‌య్య విష‌యం తెలియ‌గానే చిరంజీవి ముగ్ధుడయ్యారు. ఈశ్వ‌రయ్యను, ఆయ‌న కుటుంబ స‌భ్యుల‌ను హైద‌రాబాద్‌లోని త‌న ఇంటికి ప్ర‌త్యేకంగా పిలిపించుకుని మాట్లాడారు. వారి కుటుంబానికి పట్టు బ‌ట్ట‌లు పెట్టి స‌త్క‌రించారు. ఈ సంద‌ర్భంగా ఈశ్వ‌ర‌య్య కుటుంబానికి అండ‌గా ఉంటాన‌ని మెగాస్టార్ హామీనిచ్చారు. 

ఇవాళ చిరంజీవి అయ్య‌ప్ప మాల‌ను ధరించారు. ప్ర‌తీ ఏడాది అయ్య‌ప్ప మాల‌ను ధరించే ఆయన ఈ ఏడాది కూడా మాల‌ను ధ‌రించారు. మాల‌ధార‌ణ‌లోనూ ఈశ్వ‌ర‌య్య కుటుంబంతో చిరంజీవి క‌లిసి మాట్లాడారు. సాధార‌ణంగా చిరంజీవి త‌న వీరాభిమానుల‌కు ఎప్పుడూ అండ‌గా నిలుస్తుంటారు. చాలా సంద‌ర్భాల్లో ఇది నిరూప‌ణ అయ్యింది. 

ఇప్పుడు ఈశ్వ‌ర‌య్య గురించి తెలియ‌గానే మెగాస్టార్ మ‌రోసారి తన ప్రత్యేకతను చాటుకున్నారు. వెంటనే ఈశ్వరయ్యకు కబురు పంపి, ఆయ‌న్ని ప్ర‌త్యేకంగా క‌లుసుకున్నారు. 

గతంలో ఈశ్వ‌ర‌య్య తిరుప‌తి నుంచి మెగాస్టార్ ఇంటి వ‌ర‌కు సైకిల్ యాత్ర‌ను నిర్వ‌హించారు. అదే విధంగా ప‌వ‌న్ కల్యాణ్ పుట్టిన‌రోజుకు, జనసేన పార్టీ నెగ్గాల‌ని ఇలా అనేకసార్లు పొర్లుదండాలు పెట్టడం విశేషం.
Megastar Chiranjeevi
Eashwaraiah
Hard Core Fan
Birthday
Tirumala
Hyderabad
Tollywood

More Telugu News