Ponnam Prabhakar: ఆక్రమణల కూల్చివేత అంశంలో ఎవరిపైనా కక్ష సాధింపు లేదు: పొన్నం ప్రభాకర్

Ponnam Prabhakar says no conspiracy on demolitions
  • చెరువుల ఆక్రమణపై ప్రభుత్వం సీరియస్‌గా ఉందన్న మంత్రి
  • ఆక్రమణకు గురైన చెరువుల పునరుద్ధరణకు చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడి
  • పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని వ్యాఖ్య
చెరువుల ఆక్రమణ, కూల్చివేతల అంశంలో ప్రభుత్వానికి ఎవరి పైనా రాజకీయ కక్ష సాధింపు లేదని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. హైదరాబాద్‌లో అక్రమ కట్టడాల కూల్చివేతలపై ఆయన మాట్లాడుతూ... చెరువుల ఆక్రమణను ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుందన్నారు. ఆక్రమణకు గురైన చెరువుల పునరుద్ధరణకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. వాతావరణ కాలుష్యం నుంచి పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని మంత్రి అభిప్రాయపడ్డారు.

చెరువులకు సంబంధించి ప్రభుత్వ లెక్కలు, రికార్డులు ఉన్నాయని, ఆ మేరకు ప్రభుత్వం కార్యక్రమాలు చేపడుతోందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న జలవనరులను రక్షించుకోవాల్సి ఉందన్నారు. 

చెరువుల రక్షణపై స్థానికులే ముందుకు రావాలన్నారు. ఆక్రమణలు ఉంటే ప్రభుత్వం దృష్టికి తీసుకు రావాలన్నారు. హైడ్రాకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తోందన్నారు.
Ponnam Prabhakar
Congress
Telangana

More Telugu News