WTC Points Table: అప్‌డేట్ చేసిన డబ్ల్యూటీసీ 2023-25 ​​పాయింట్ల పట్టిక ఇదే!

this Updated WTC 2023 25 Points Table after Pakistan lose against Bangladesh
  • పాక్‌పై చారిత్రాత్మక విజయంతో 6వ స్థానానికి ఎగబాకిన బంగ్లాదేశ్
  • ఊహించని ఓటమితో 8వ స్థానానికి పడిపోయిన పాక్
  • తొలి రెండు స్థానాల్లో కొనసాగుతున్న భారత్, ఆస్ట్రేలియా జట్లు
రావల్పిండి టెస్టులో బంగ్లాదేశ్ చేతిలో పాకిస్థాన్ ఓడిపోవడంతో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2023-25 (డబ్ల్యూటీసీ) పాయింట్ల పట్టికలో మార్పులు చోటుచేసుకున్నాయి. పాక్‌పై చారిత్రాత్మకమైన విజయం సాధించిన బంగ్లాదేశ్‌ పాయింట్ల పట్టికలో 6వ స్థానానికి ఎగబాకింది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2023-25 సైకిల్‌లో ఇప్పటివరకు 5 మ్యాచ్‌లు ఆడిన ఆ జట్టు 2 విజయాలు సాధించి 40 శాతం పాయింట్లతో తన స్థానాన్ని మెరుగు పరచుకుంది. 

ఇక, రావల్పిండి టెస్టులో అనూహ్య రీతిలో ఓటమి పాలైన పాకిస్థాన్ పాయింట్ల పట్టికలో 8వ స్థానానికి దిగజారింది. పాకిస్థాన్ ఇప్పటివరకు 6 మ్యాచ్‌లు ఆడి 2 విజయాలు మాత్రమే సాధించింది. ఆదివారం ముగిసిన రావల్పిండి టెస్టులో 10 వికెట్ల తేడాతో బంగ్లాదేశ్ చేతిలో ఘోర ఓటమి పాలవ్వడంతో పాక్‌ స్థానం దిగజారింది. గత కొంతకాలంగా టెస్ట్ క్రికెట్‌లో పాకిస్థాన్ జట్టు ఆటతీరు చాలా పేలవంగా ఉంది. అందుకే ఈ జట్టు ర్యాంక్ దారుణంగా వెనుకబడింది. 

అగ్రస్థానంలో భారత్..

డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో భారత్ అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఇప్పటివరకు 9 టెస్ట్ మ్యాచ్‌లు ఆడిన ఇండియా 68.52 శాతం పాయింట్లతో నంబర్ వన్ స్థానంలో ఉంది. ఇక ఇప్పటివరకు 12 మ్యాచ్‌లు ఆడి 8 విజయాలు సాధించినప్పటికీ 62.50 శాతం పాయింట్లతో రెండవ స్థానానికి పరిమితమైంది.

ర్యాంకింగ్స్ (పాయింట్ల శాతం)
1. ఇండియా (68.52)
2. ఆస్ట్రేలియా (62.50)
3. న్యూజిలాండ్ (50.00)
4. ఇంగ్లాండ్ (41.07)
5. శ్రీలంక (40.00)
6. బంగ్లాదేశ్ (40.00)
7. దక్షిణాఫ్రికా (38.89)
8. పాకిస్థాన్ (30.56)
9. వెస్టిండీస్ (18.52)
WTC Points Table
Cricket
Team India
ICC

More Telugu News